స్టైల్ మారింది.. నడక మారింది...
on Mar 26, 2025
ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా.. తనని తాను మార్చుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు. ప్రతి సినిమాలోనూ లుక్స్ పరంగా ఎంతో కొంత వైవిధ్యం చూపిస్తుంటాడు. కానీ, ఆఫ్ స్క్రీన్ లుక్స్ పరంగా మాత్రం.. తారక్ పెద్దగా కేర్ తీసుకోడనే పేరుంది. అయితే ఇప్పుడు దానికి కూడా చెక్ పెడుతున్నాడు. (Jr NTR)
ఎన్టీఆర్ బయట ఎక్కువగా క్యాజువల్ వేర్ లోనే కనిపిస్తుంటాడు. స్టైలింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా కనిపించడు. అలాంటి తారక్ ఉన్నట్టుండి పూర్తిగా స్టైల్ మార్చేశాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' మూవీ మార్చి 28న జపాన్ లో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన తారక్.. తన ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఎప్పుడూ కనిపించని విధంగా సరికొత్త స్టైలింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో ఎన్టీఆర్ లో ఒకేసారి ఇంత మార్పు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ పొందాడు. అలాగే ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. భవిష్యత్ లోనూ బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచనలో తారక్ ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఎన్టీఆర్ సంబంధించిన న్యూస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో రావడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆయన లుక్స్ గురించి కూడా చర్చ జరిగే అవకాశముంది. అందుకే స్టైలింగ్ విషయాన్ని ఇంతకాలం పెద్దగా పట్టించుకోని ఎన్టీఆర్.. ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ఫలితంగానే జపాన్ టూర్ లో ఎన్టీఆర్ స్టైలింగ్ లో ఇంత మార్పు కనిపించిందని అంటున్నారు. తారక్ లేటెస్ట్ స్టిల్స్ చూసి, ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ విషయంలో.. ఎప్పుడూ ఇలాగే కేర్ తీసుకుంటే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
