Home

»

Latest News

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే బ్లాస్ట్: ఒకేరోజు నాలుగు అప్‌డేట్స్‌.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే!

Apr 18, 2026

- నాలుగు సినిమాలపై క్లారిటీ!

- తారక్ ఫ్యాన్స్‌కు పండగే.. 

- మే 20న ఎన్టీఆర్ డబుల్ ధమాకా 

మే నెల వచ్చిందంటే చాలు నందమూరి అభిమానుల్లో పండ‌గ వాతావ‌రణం నెల‌కొంటుంది. దానికి కార‌ణం మే 20న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావ‌డ‌మే. అయితే ఈ ఏడాది తారక్ బర్త్ డే వేడుకలు కేవలం సోషల్ మీడియా విషెస్‌కే పరిమితం కాకుండా, బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ ఒకేరోజు రాబోతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.

ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్‌లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'డ్రాగన్'. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను బర్త్ డే స్పెషల్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నీల్ మార్క్ ఎలివేషన్లతో కూడిన ఈ చిన్న వీడియో అభిమానులకు అసలైన కనువిందు చేయనుందని సమాచారం.

మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' పార్ట్ 1 సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఫ్యాన్స్ 'దేవర 2' ఎప్పుడు మొదలవుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్తయినప్పటికీ, షూటింగ్ షెడ్యూల్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మే 20న దేవర పార్ట్ 2పై ఒక పక్కా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంలో ఆరోజు అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

ఇక అందరి కళ్లు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. 'అరవింద సమేత' తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న 'గాడ్ ఆఫ్ వార్' సినిమాపై ఇప్పటికే క్రేజీ బజ్ నడుస్తోంది. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు? అసలు కథా నేపథ్యం ఏంటి? అనే విషయాలపై తారక్ పుట్టినరోజున ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటు కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై కూడా ఈసారి ముహూర్తం కుదిరేలా కనిపిస్తోంది.

వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, తన అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 'డ్రాగన్' తర్వాత ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్తుంది? 'దేవర 2' ముందా లేక త్రివిక్రమ్ సినిమానా? అనే సస్పెన్స్‌కు ఈ పుట్టినరోజుతో తెరపడనుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే #NTRBirthday2026 ట్రెండింగ్ మొదలైపోయింది. ఈ అప్డేట్ల వర్షంలో తారక్ తన అభిమానులకు ఎలాంటి స‌ర్‌ప్రైజ్‌ ఇస్తారో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com