ఎన్టీఆర్, చరణ్ మధ్య బిగ్ ఫైట్.. నలిగిపోతున్న నాని..!
on Mar 21, 2025
'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రానున్న మూవీ 'ది ప్యారడైజ్'. ఇటీవల విడుదలైన 'ప్యారడైజ్' గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఏ ముహూర్తాన ఈ రిలీజ్ ని ఫిక్స్ చేశారో కానీ.. ఈ డేట్ పై మిగతా స్టార్స్ కన్నేస్తున్నారు. (The Paradise)
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ 'డ్రాగన్'. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 'డ్రాగన్' సినిమాని సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ఆలస్యంగా మొదలు కావడంతో.. ఈ సినిమాని 2026 మార్చి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. అదే జరిగితే నానికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అది చాలదు అన్నట్టు, ఇప్పుడు మరో సినిమా మార్చి 26 తేదీపై కన్నేసినట్లు తెలుస్తోంది. (NTR Dragon)
రామ్ చరణ్ తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ సినిమాని 2026 వేసవికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు 2026 మార్చి 26 డేట్ ని లాక్ చేయాలని చూస్తున్నారట. ఎందుకంటే మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే కానుకగా ఒకరోజు ముందు సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. (RC 16)
డ్రాగన్, RC16 రెండూ భారీ సినిమాలే. అలాంటిది ఈ రెండు సినిమాలు.. 'ప్యారడైజ్' రిలీజ్ డేట్ పై కన్నేయడం నానికి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఆ రెండూ ఒకేసారి విడుదలైతే.. తన సినిమాని వాయిదా వేసుకోవడం తప్ప నానికి మరో ఆప్షన్ ఉండదు. ఎందుకంటే.. ఎన్టీఆర్, చరణ్ సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ పోరు ఉంటుంది. ఆ సమయంలో ప్రేక్షకులు ఇతర సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పోనీ ఈ రెండూ సినిమాల్లో ఏదో ఒక్కటే విడుదలైనా కూడా.. థియేటర్ల పరంగా, కలెక్షన్ల పరంగా ప్యారడైజ్ తీవ్ర ప్రభావం ఎదుర్కోక తప్పదు. ఈ లెక్కన నాని తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
