అవ్వ జోస్యం నిజమైంది.. సుజాత సొంత ఇంటిదారి పట్టింది!
on Oct 12, 2020

బిగ్ బాస్ సీజన్ 4లో తెలంగాణ యాసను బిగ్ హౌస్ లో పలికించి గ్రామీణ ప్రేక్షకులను ఆకట్టుకున్నఇద్దరు కంటెస్టెంట్లు ఐదోవారంలో ఇంటిదారి పట్టారు. ఆరోగ్య సమస్యలతో ఒకరు, ఎలిమినేషన్ తో మరొకరు. వీకెండ్ షోలో గంగవ్వ ఆరోగ్యవిషయాలను పరిశీలించి ఇంటికి పంపించే క్రమంలో జోర్దార్ సుజాత ఎలిమినేట్ అవుతుందని అవ్వకూడా గ్రహించింది. దాంతో అవ్వ జోస్యం నిజమై జోర్దార్ సుజాత కూడా ఇంటిదారి పట్టింది. వీరిద్దరూ ఒకేవారం ఇంటినుంచి బయటకు రావడంతో బిగ్ హౌస్ లో పల్లెవాసన చాలావరకు పోయింది. నాగ్ ను బిట్టూ అని పిలిచే సుజాత చివరిగా 36ఎపిసోడ్ లో బిట్టు భాయ్ అంటూ బిగ్ బాస్ హౌస్ కు వీడ్కోలు పలికింది. కెప్టెన్ సోహైల్ బిగ్ హౌస్ లో వారంరోజుల పాటు గిన్నెలు తోమాలని బిగ్ బాంబ్ వేసింది.
మొదట ఈ వారం ఎలిమినేషన్స్ జాబితాలో ఉన్న అభిజిత్, అరియానా, నోయల్ సేఫ్ అని ప్రకటించారు నాగార్జున. సరదా గేమ్ పూర్తి అయిన తర్వాత పగా ప్రతీకారం అంటూ మరో టాస్క్ ఇచ్చారు నాగార్డున. బిబి హోటల్ టాస్క్ లో స్టాఫ్ ను ఇబ్బంది పెట్టిన గెస్ట్ లపై రివెజ్ తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ లో హారికతో నుదిటిపై గాజు గ్లాసు, అందులో నీళ్లుపోసి నడిపించారు అమ్మ రాజశేఖర్. కోడిలా పరిగెత్తాడు సోహైల్. సుజాతను ఎత్తుకుని మెహబూబ్ 50 గుంజీళ్లు తీశాడు. అవినాష్‌ను ఎత్తుకుని కింద పడేసింది అరియానా. ఈ టాస్క్ తర్వాత లాస్య, మోనాల్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు. దాంతో ఎలిమినేషన్ జాబితాలో మిగిలిన సుజాత, అమ్మ రాజశేఖర్ లను గార్డెన్ ఏరియాలోకి వెళ్లామన్నాడు నాగార్జున. అక్కడ ఐస్ క్యూబ్ టాస్క్ ఇచ్చి సుత్తితో దానిని పగలగొట్టమని చెప్పగా చివరకు అందులో సుజాత ఫొటో వచ్చింది. దాంతో ఈ వారం సుజాత ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు.
.jpg)
ఇంటిసభ్యులంతా వీడ్కోలు పలకగా స్టేజీ పైకి వచ్చింది సుజాత. ఎలిమినేట్ అవుతాననుకోలేదని, అనుకోనివి జరగడమే బిగ్ బాస్ అన్న సుజాత జర్నీని నాగార్జున మనటీవీలో చూపించారు. "నా లెక్క నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న. హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు ఏదో నౌకరి చేసుకుంటూ.. నా అమ్మవాళ్లకు నా బిడ్డ అంతే అన్నట్టు ఉంటా అనుకున్నాను. ఈరోజు వాళ్లు ఎంతో సంతోషంగా ఉండే స్థాయికి బిగ్ బాస్ వల్ల వచ్చిన".. అంటూ సుజాత ఎమోషన్స్ పంచుకుంది. ఆ తర్వాత ఇంటిసభ్యులతో ఉన్న అనుబంధాన్ని హార్ట్ ముక్కల ద్వారా చెప్పమని నాగార్జున అన్నారు. దాంతో ఫుల్ హార్ట్ నోయల్, లాస్య, అవినాష్‌కు ఇచ్చింది. బ్రోకెన్ హార్ట్ తనతో చిన్న చిన్న సమస్యలు ఉన్న అభిజిత్, అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, కుమార్ సాయికి ఇచ్చింది. బ్లాక్ హార్ట్ ను హారిక, దివి, సోహైల్, అఖిల్, మోనాల్‌కు పెట్టింది. ఆ తర్వాత వారం రోజులపాటు బౌల్స్ అన్నీ తోమాలని సోహైల్ పై బిగ్‌బాంబ్ వేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



