అసలు విషయం రెడ్ సన్ అనే ఆఫ్రికా వజ్రం..సైఫ్ అలీ ఖాన్ దొరికేసాడా!
on Apr 14, 2025
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'సైఫ్ అలీ ఖాన్'(Saif Ali khan)సినీ జర్నీ అందరకి తెలిసిందే. 1993 లో 'పరంపర' అనే చిత్రంతో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. యే ధిల్లగీ,మై కిలాడీ తు అనారి,దిల్ చాతా హై,కల్ హోనా హో,ఓంకార,లవ్ ఆజ్ కల్, రేస్ 2 ,కాక్టెయిల్,పరిణీత,సలాం నమస్తే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం మల్టి స్టారర్ చిత్రాలే. గత ఏడాది 'ఎన్టీఆర్' వన్ మాన్ షో 'దేవర'లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు.
ప్రస్తుతం సైఫ్ హిందీలో 'జ్యువెల్ థీఫ్'(Jewel Thief)అనే మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గా ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. వజ్రాలు దొంగతనం చేసే ఒక ఖరీదైన దొంగ క్యారక్టర్ ని సైఫ్ పోషించాడు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన 'రెడ్ సన్'(Red son)అనే ఆఫ్రికా కి చెందిన విలువైన వజ్రాన్ని కాజెయ్యాలనే ప్లాన్ లో సైఫ్ అలీ ఉన్నట్టుగా ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. డైలాగ్స్ పరంగా చూసుకుంటే 'మీ మ్యూజియంలో దోచుకున్నట్టే ప్రపంచంలోని అన్ని మ్యూజియంలని అతను దోచుకున్నాడు, అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పని చేస్తున్నావు, నువ్వు కూడా ఒక ఆట ఆడుతున్నావు కదా! నేను సాధారణ దొంగను అనే పలు డైలాగ్స్ మూవీపై ఆసక్తిని కలగచేస్తున్నాయి. పోరాట సన్నివేశాలు కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయం కూడా ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది.
పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న జ్యువెల్ థీఫ్ లో సైఫ్ తో పాటు జైదీప్ అహ్లావత్(Jaideep Ahlawat)కునాల్ కపూర్, నిఖిల్ దత్త కీలక పాత్రలు పోషించగా కుకీ గులాటి(Kookie Gulati)రాబీ గేర్(Robbie Garewal)వాల్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ నెల 25 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
