రెస్టారెంట్ స్టార్ట్ చేసిన నాని హీరోయిన్
on Mar 9, 2020
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' చిత్రంలో కథానాయకుడిగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గుర్తుందా? ఆమె ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసింది. అది ఆమె సొంతూరిలో కాదు... చెన్నైలో! రెస్టారెంట్ పేరు 'పర్ సే'. బేసికల్లీ... అందులో సలాడ్స్ ఎక్కువ ఉంటాయి. రెస్టారెంట్ అనడం కంటే సలాడ్ బార్ అండ్ కేఫ్ అని చెప్పవచ్చు. రెగ్యులర్ బర్గర్స్, శాండ్ విచ్ వంటివి కాకుండా హెల్తి ఫుడ్ తమ రెస్టారెంట్ లో ఉంటుందని శ్రద్ధా శ్రీనాథ్ చెబుతున్నారు. గతంలో శ్రద్ధా శ్రీనాథ్ చాలా లావుగా ఉండేవారు. 'లా' చేసి, కొన్ని రోజులు లాయర్ ప్రాక్టీస్ కూడా చేసిన తర్వాత హీరోయిన్ అవ్వాలనుకున్నాను. అప్పుడు చాలా బరువు తగ్గారు. అందుకని హెల్తి ఫుడ్ అందించే రెస్టారెంట్ స్టార్ట్ చేసారు.
సినిమాల విషయానికి వస్తే.... కర్ణాటకకు చెందిన శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. 'జెర్సీ' తర్వాత తెలుగులో 'జోడీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో ఆది సాయి కుమార్ సరసన నటించారు. అది విజయం సాధించలేదు. త్వరలో 'కృష్ణ అండ్ హిజ్ లీల' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.