జానీ మాష్టర్ : కోర్ట్ నుంచి క్లీన్ చిట్ తో బయటకు వస్తాను
on Dec 26, 2024
టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాష్టర్ తరచూ వివాదాల్లో నిలుస్తున్నాడు.లేడీ కొరియోగ్రాఫర్‌పై ఆయన చేసిన లైంగిక దాడి నిజమేనని హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.దీనిపై జానీ మాష్టర్ స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. "నేను నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి. నాకు తెలిసింది ఒక్కటే వచ్చిన పనితో బాగా కష్టపడడం, ఎంటర్టైన్ చేయడం. నాకు వచ్చిన విద్యతో అందరినీ అలరించడం. ఇప్పుడు నాకుఉన్న ఏ పొజిషన్ ఐనా మీ బ్లెస్సింగ్ వల్లనే. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది.
ఆ న్యాయం ఉంది కాబట్టే ఈరోజు నేను నలుగురితో పనిచేసుకుంటున్నాను. అసలు ఎం జరిగింది అన్నది నా అంతరాత్మకు, ఆ దేవుడికి, నా మనసుకు తెలుసు. న్యాయస్థానం నుంచి నేను క్లీన్ చిట్ తో బయటకు వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అప్పుడు మాట్లాడుతా. లవ్ యు అల్ " అంటూ జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు పెట్టింది లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. అటు లైంగిక వేధింపుల కేసు కారణంగా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు కూడా రాకుండా పోయింది.
Also Read