అక్కడ కొల్లగొడతానంటున్న ఎన్టీఆర్..
on Aug 31, 2016
తెలుగు సినిమా మార్కెట్ మెల్ల మెల్లగా ప్రపంచమంతా వ్యాపిస్తోంది కానీ పక్కనే ఉన్న తమిళనాడులో మాత్రం మనోళ్లకు అంత సీన్ లేదు. అయితే ఇప్పుడిప్పుడే మన హీరోలకు జ్ఞానదోయం అవుతోంది. అందుకే పొరుగు రాష్ట్రాల్లో మార్కెట్ పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. అయితే ఎక్కడ పడితే అక్కడ..ఏ భాషలో పడితే ఆ భాషలోకి రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉండకపోగా..మొదటికే మోసం వస్తుంది. అందుకు కాంభినేషన్లు సెట్ అవ్వడం కీలకం. తాజాగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వంలో రూపొందిన సినిమా జనతా గ్యారేజ్.
ఈ సినిమాని అటు మలయాళం, ఇటు తమిళ్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. కారణం మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనుండటమే. ఆయనకు సొంతరాష్ట్రంలోనూ..తమిళంలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే సమంత, నిత్యమేనన్ కూడా అక్కడ పాపులార్. ఇక డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ నటించిన శ్రీమంతుడు తమిళ్లో బాగా ఆడింది. నాట్ బట్ నాట్ ది లిస్ట్ దేవిశ్రీ. మనోడి మ్యాజీక్ అంటే తెలుగువారితో పాటు తమిళులు కూడా పడి చస్తారు. ఇవన్నీ సెట్ కావడం వల్లనే తమిళనాట దాదాపు 100కు పైగా ధియేటర్లలో జనతా గ్యారేజ్ రిలీజవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తమిళ్లో కలెక్షన్లు కుమ్మెయడం ఖాయం.