జనతా గ్యారేజ్ కోసం మరో సెట్ రెడీ..!
on Apr 21, 2016

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ టీం ఎక్కడా తగ్గట్లేదు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారు. హెవీ క్యాస్టింగ్ తో సెన్సేషనల్ అయిన జనతా గ్యారేజ్ యూనిట్, ఇప్పుడు సెట్స్ తో కూడా వార్తల్లోకి ఎక్కుతోంది. భారీ ఖర్చుతో సారథి స్టూడియోస్ లో అద్భుతమైన సెట్ వేయించాడు దర్శకుడు కొరటాల. తాజాగా రెండు కోట్ల భారీ బడ్జెట్ ను వెచ్చించి, సినిమాలో చాలా కీలకమైన పెద్ద మండువా లోగిలి పెంకుటింటి సెట్ వేశారట. జనతా గ్యారేజ్ లో ఫ్యామిలీ సీన్స్ కు సంబంధించి పతాక సన్నివేశాలు ఇక్కడే వస్తాయని, అందుకే ఖర్చుకు వెనకాడకుండా సెట్ ను నిర్మించారని మూవీ వర్గాలంటున్నాయి. ఇప్పటి వరకూ టాలీవుడ్ సినిమాల్లో వేసిన అత్యంత ఖరీదైన సెట్టింగ్స్ లో ఈ సెట్ కూడా చేరుతుందంటున్నారు. అంచనాలను అందుకోవడం కోసం, కొరటాల అండ్ కో ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేశారు. ప్రస్తుతం సినిమాను ఫ్యామిలీ సీన్స్ లోకి మార్చారని సమాచారం. మరి ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఏం చేయబోతున్నాడో తెలియాలంటే మాత్రం ఆగష్ట్ 12 వరకూ ఆగాల్సిందే..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



