విజయ్ రాజకీయ ప్రచారానికి బాలయ్య ప్లస్ అవ్వబోతున్నాడా!
on Mar 25, 2025
తమిళ అగ్ర హీరో 'ఇళయ దళపతి విజయ్'(Vijay)తన సినీ కెరీర్ లో నటిస్తున్నచివరి మూవీ 'జననాయగాన్'(Jana Nayagan).దీంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా 'జననాయగాన్' పై భారీ అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా,హెచ్ వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ విజయ్ కెరీర్ లో ఒక మరిచిపోలేని మైలురాయిగా నిలిచిపోవాలని భారీ వ్యయంతో నిర్మిస్తుంది.పూజాహెగ్డే(pooja hegde)హీరోయిన్ గా చేస్తుండగా మమిత బైజు(Mamitha Baiju)ప్రియమణి(priyamani)బాబీడియోల్,ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జన నాయగన్ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుందని చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది.ఈ మేరకు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడంతో తమిళనాట పొలిటికల్ గాను హీట్ పెరిగింది.ఎందుకంటే తమిళనాట 2026 లో ఏప్రిల్,మే మధ్య ఎలక్షన్స్ జరగవచ్చని అంటున్నారు.ఈ నేపథ్యంలో విజయ్ కూడా తన రాజకీయ పార్టీ తరుపున ఆ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుండటం,మూవీ కూడా జనవరి లో వస్తుండటంతో'జననాయగన్' కథపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది.పైగా ఈ మూవీ తోనే విజయ్ తన ప్రచారానికి శ్రీకారం చూడుతున్నట్టే అని కూడా అనుకోవచ్చు.ఈ నేపథ్యంలో విజయ్ కి ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ముఖ్యమో,కథ అంత కంటే ఎక్కువ ముఖ్యం.తన బావ జాలం కూడా ఈ మూవీ ద్వారానే ప్రేక్షకులకి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)హిట్ మూవీ'భగవంత్ కేసరి'(Bhagavanth kesari)ని విజయ్ ఎంచుకున్నాడనే వార్తలు జోరందుకున్నాయి.గతంలో కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి.కానీ ఇప్పుడు పక్కాగా భగవంత్ కేసరి కథ తోనే జన నాయగన్ తెరకెక్కబోతుందనే చర్చలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి.జననాయగన్ కాస్టింగ్ ని చూస్తే కూడా ఆ కోవలోనే ఉంది.
భగవంత్ కేసరి కథ అందరకి తెలిసిందే.అడవిబిడ్డ భగవంత్ కేసరి ఒక పోలీస్ అధికారికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన కూతురుని ఆర్మీలో చేర్చాలనుకుంటాడు.దీంతో పిరికితనం నిండిన ఆమెని దైర్యవంతరాలిగా చేస్తాడు.మరో పక్క రాజకీయ నాయకులని తన గుప్పెట్లో పెట్టుకొని 'ప్రాజెక్టు వి' కోసం విలన్ అర్జున్ రామ్ పాల్ ప్రయత్నాలు చేస్తుంటే భగవంత్ కేసరి అడ్డుకుంటాడు,ఇలా ఈ చిత్రం ఆడవాళ్ళకి మంచి మెసేజ్ ని ఇవ్వడంతో పాటు,రాజకీయనాయకుల,స్వార్థపరుల ఆట కూడా కట్టించింది.కమర్షియల్ గా,పొలిటికల్ గా,మెసేజ్ పరంగా అన్ని అంశాలు ఉండటంతో విజయ్ కోసం కొన్ని మార్పులు చేసి భగవంత్ కేసరి ని తెరకెక్కించారనే మాటలు వినపడుతున్నాయి.ఇదే నిజమైతే బాలయ్య భగవంత్ కేసరి విజయ్ రాజకీయ కెరీర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
