'జైలర్' జోరు తగ్గట్లేదుగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 60 కోట్లు!
on Aug 19, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా 'జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. విడుదలైన ప్రతీ చోట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఫలితంగానే.. రూ. 124 కోట్ల షేర్ టార్గెట్ తో బాక్సాఫీస్ ముందు నిలిచిన 'జైలర్' తక్కువ కాలంలోనే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడమే కాకుండా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. శుక్రవారంతో తొమ్మిది రోజుల ప్రదర్శన చేసుకున్న ఈ సెన్సేషనల్ మూవీ.. ఇప్పటివరకు రూ. 96. 35 కోట్లకి పైగా లాభాలు ఆర్జించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే శుక్రవారంతో రూ. 60 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసింది.
'జైలర్' తొమ్మిది రోజుల కలెక్షన్స్ వివరాలు:
తమిళనాడు – రూ. 132.10 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 60.15 కోట్ల గ్రాస్ (తమిళ వెర్షన్ తో కలిపి)
కర్ణాటక- రూ. 50.15 కోట్ల గ్రాస్
కేరళ – రూ. 39.15 కోట్ల గ్రాస్
రెస్టాఫ్ ఇండియా – రూ. 9.40 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ – రూ. 158.80 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది రోజుల కలెక్షన్స్ – రూ. 449.75 కోట్ల గ్రాస్ (రూ. 220.35 కోట్ల షేర్)

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
