ట్రైలర్ రివ్యూ: జై సింహా
on Dec 25, 2017

తన వయసు హీరోలంతా ఆచితూచి.. నెమ్మదిగా సినిమాలు చేస్తుంటే తాను మాత్రం ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ తుఫాన్ వేగంతో దూసుకెళ్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ కేఎస్. రవికుమార్ దర్శకత్వంలో జై సింహా చేస్తున్నాడు. ఈ మూవీ ఆడియో రిలీజ్ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
యాక్షన్ సీన్స్‌తో పాటు ట్రైలర్ నిండా డైలాగుల్ని నింపేశాడు డైరెక్టర్. ఎవడ్రా వాడు.. ఆ కళ్లల్లో పవర్ ఏంటీ..? ఎక్కడ్నుంచి వచ్చాడు వాడు.. అంటూ ట్రైలర్ మొదలవుతుంది. రెండు గెటప్స్‌లో బాలయ్య కనిపించాడు..నయనతార లుక్స్, ప్రకాశ్ రాజ్ గెటప్, చిరంతన్ భట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. కథేంటి అన్నది చిన్న క్లూ కూడా ట్రైలర్‌లో కనిపించలేదు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



