ఫుడ్ వ్లాగర్ అవతారమెత్తిన జగ్గు భాయ్..నువ్వు గ్రేట్ భయ్యా
on Dec 26, 2024
నటుడు జగపతి బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే డౌన్ టు ఎర్త్ అని ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. ఆయనొక బెస్ట్ ఫుడీ. అది కూడా లిమిట్ గా హెల్తీగా చేసుకుంటారు .. ఇంట్లో ఆయనే తన ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారు. ఆ వీడియోస్ ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుందో తెలుసుకుని మరీ వెళ్లి తినొస్తుంటారు. మూవీస్ లో నటించేటప్పుడు వామ్మో జగపతిబాబు విలనిజాన్ని తట్టుకోలేము చూసి. కానీ పక్కన నిలబడి రోడ్ సైడ్ ఫుడ్ అందరితో కలిసి తిన్నప్పుడు ఈయనేంటి ఇంత కలిసిపోతాడా అని సాఫ్ట్ కార్నర్ కూడా జనాల్లో ఏర్పడుతూ ఉంటుంది.
అలాంటి జగ్గు భయ్యా ఇప్పుడు భీమవరం రుచులని ఆస్వాదిస్తూ ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. " భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యుటీకి ఈ మనిషి రోడ్డున పడ్డాడు..ఏదేమైనా బండి ఫుడ్ అంటే బండి ఫుడ్డే..." అంటూ కామెంట్ కూడా పెట్టారు. ఐతే ఒక రోడ్ సైడ్ బండి దగ్గర చల్ల పునుగులు, బజ్జీలు తింటూ ఉండగా అక్కడ జనం గుమ్మి గూడారు. ఆ పిక్ చూసిన ఒక నెటిజన్ "అయ్యా..మళ్ళీ తొక్కిసలాట ఐతే...మీడియాకి మంచి టాపిక్ దొరుకుతుంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి రిప్లైగా మరో నెటిజన్ "క్లోజ్డ్ గా ప్లేస్ కి ఓపెన్ ప్లేస్ కి తేడా తెలీడం లేదా బ్రో" అంటూ రిప్లై ఇచ్చారు. "జగ్గు అన్నా మీ ఎంజాయ్ వేరే లెవెల్..మీరు సూపర్, గ్రేట్ సర్" అంటూ రిప్లైస్ ఇస్తున్నారు. ఐతే బన్నీ ఇష్యూతో ఏ సెలెబ్రిటీ ఐనా కానీ ఎక్కడికి వెళ్లాలన్నా కూడా భయపడే పరిస్థితి నెలకొంది. ఇక జగ్గు భాయ్ రీసెంట్ గా సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీ తేజ్ ని కూడా హాస్పిటల్ కి వెళ్లి కలిసి వచ్చారు. తాను వెళ్లి కలిసి వచ్చిన విషయం పబ్లిసిటీ చేసుకోలేదని ఐతే ఇప్పుడు దీని గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప 2 లో జగపతి బాబు నటించిన విషయం తెలిసిందే.
Also Read