యాంకర్ రష్మీ వీపుపై మూవీ ట్యాగ్ లైన్
on Apr 9, 2016
యాంకర్ కమ్ యాక్టర్ రష్మీ గౌతమ్ లేటేస్ట్ మూవీ అంతం. రష్మీ, చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ ఓవరాల్‌గా కంప్లీటైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గుంటూరు టాకీస్‌లో హాట్‌గా కనిపించిన రష్మీ ఈ మూవీలో మరింత గ్లామరస్‌గా కనిపించనున్నారు. ఈ పోస్టర్లో తన బ్యాక్ ఫిగర్‌ను చూపెడుతన్న రష్మీ వీపుపై మీ ఊహకందనిది జరగబోతోంది అంటూ ట్యాగ్ లైన్‌ను వేశారు. రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని అయినందున ఆయన అంతం చిత్రాన్నే మా మూవీ టైటిల్‌గా పెట్టామన్నారు దర్శక నిర్మాత జిఎస్ఎస్పి కళ్యాణ్. రష్మీ అందంతో పాటు పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లో నటించిందని ఆయన తెలిపారు. సమ్మర్ కానుకగా ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తామని ఆయన ప్రకటించారు.