
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డేగల బాబు. ఒక సాధారణ కంటెస్టెంట్‌గా షోలోకి అడుగుపెట్టి.. తన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ కమెడియన్ తన అభిమానులకు మరో గుడ్‌న్యూస్ చెప్పాడు. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు.
శుక్రవారం (నవంబర్ 20) బాబు, అమూల్య వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను స్వయంగా బాబే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్ల, బుల్లితెర ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బాబు పెళ్లి వేడుకకు పలువురు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. సునీత, టేస్టీ తేజ, జిత్తు, సందీప్, పంచ్ ప్రసాద్, నూకరాజు తదితరులు వేడుకలో సందడి చేశారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఒకప్పుడు జబర్దస్త్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన బాబు.. తన ప్రతిభతో టాప్ కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలలోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.?
నటనతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌లోనూ బాబుకు మంచి పట్టుంది. ఇప్పటికే పలు టీవీ షోల కోసం వందలాది స్కిట్లు రాశాడు.
ఇటీవలే మెగాఫోన్ పట్టి ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఓటీటీలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు దర్శకుడిగా బాబుకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కెరీర్‌లో ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతున్న సమయంలోనే తన ఏడేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నాడు.
మీకు నచ్చవచ్చు:
త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ.. చిరంజీవితోనా.. సూర్యతోనా.?
450 కోట్ల సినిమా.. ఎవరూ పట్టించుకోలేదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.!
[Jabardasth Babu, Wedding, Marriage, Babu Amulya]





