తెలుగు ఎందుకు లేటు ధనుష్..ఇక్కడ కూడా నీకు ఫ్యాన్స్ ఉన్నారుగా
on Mar 24, 2025
తమిళ స్టార్ హీరో ధనుష్(Dhanush)దర్శకత్వంలో పవిష్ నారాయణ్,అనికా సురేంద్రన్,ప్రియా ప్రకాష్ వారియర్,మధ్యు థామస్,రబియా కాటూన్,రమ్య రంగనాధన్, వెంకటేష్ మీనన్, శరత్ కుమార్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama)తమిళంలో 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబం'పేరుతో తెరకెక్కగా ఫిబ్రవరి 21 న తమిళంతో పాటు తెలుగు నాట రిలీజయ్యి మంచి మౌత్ టాక్ ని సొంతం చేసుకుంది.
ఈ మూవీ మార్చి 21 నుంచి తమిళ ప్రేక్షకుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీలోకి వచ్చేసింది ఈ విషయాన్ని గతంలో ధనుష్ ఎక్స్(X)వేదికగా కూడా తెలియచేసాడు.పైగా ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్ అని మెన్షన్ చెయ్యడంతో తెలుగు ప్రేక్షకులు తెలుగు ఓటిటి డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.రీసెంట్ గా తెలుగుకి సంబంధించిన ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ దగ్గర కాకుండా,సింప్లి సౌత్ దగ్గర ఉన్నట్టుగా కన్ఫార్మ్ చేశారు.సదరు సంస్థ అతి త్వరలో తమ నుంచి జాబిలమ్మ నీకు అంత కోపమా ఇండియాలో కాకుండా వరల్డ్ వైడ్ గా ఓటిటి ద్వారా రిలీజ్ కాబోతుందనే అప్డేట్
ని అందించారు.దీంతో ఇండియాలో తెలుగు వెర్షన్ పై ఇంకా సస్పెన్స్ గానే ఉందని చెప్పాలి.
తెలుగు(Telugu)మూవీ లవర్స్ అయితే తెలుగు వెర్షన్ లో ఎందుకు డిలే అవుతుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.జివి ప్రకాష్ కుమార్(Gv prakashkumar)సంగీత సారధ్యంలో ధనుష్, కస్తూరి రాజా,విజయలక్ష్మి కస్తూరి నిర్మాణంలో 'జాబిలమ్మ నీకు అంత కోపమా' తెరకెక్కింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
