నటి జత్వాని కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు!
on Sep 15, 2024
ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్ అయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కూడా సస్పెండ్ అయ్యారు.
పెళ్ళికి నిరాకరించినందుకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనను నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని నటి జత్వాని ఫిర్యాదు చేశారు. అలాగే అప్పుడు కొందరు పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆమె పేర్కొన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. విచారణ చేపట్టి దోషులపై చర్యలు తీసుకుంటోంది.
Also Read