తేరీ సినిమా రిలీజ్ హాల్లో పురుషులకు నో ఎంట్రీ..!
on Apr 11, 2016
ఇళయదళపతి విజయ్ తేరీ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తెలుగులో పోలీసోడుగా రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. తమిళనాడు అంతటా, రేపటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేస్తున్నారు. తమిళ కొత్త సంవత్సరం రోజున రిలీజ్ అవుతుండటంతో తేరీ టిక్కెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాదాపు తమిళనాట అంతటా, ముందు రోజు రాత్రి నుంచే బెనిఫిట్ షోలు రన్ చేయబోతున్నారు. అక్కడ మహిళలు, పిల్లల్లో విజయ్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే వాళ్ల కోసం స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారు విజయ్ అభిమానులు. అందుకే కరైకూడిలోని సత్యన్ థియేటర్లో కేవలం మహిళలకు, పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉండేలా షోను ఏర్పాటు చేస్తున్నారు. సినిమా రిలీజ్ రోజున ఉదయం 7 గంటలకు పడే ఈ షో కు కూడా టిక్కెట్లకు హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టక తప్పదనేది విజయ్ ఫ్యాన్స్ అంచనా. ఇలాంటి షో, ఇదే ఫస్ట్ టైం అంటూ విజయ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా అట్లీ డైరెక్ట్ చేసిన తేరీని పోలీసోడుగా తెలుగులోకి దిల్ రాజు తీసుకొస్తున్నారు. విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.