గుడ్ బ్యాడ్ అగ్లీ టీంకి ఇళయరాజా నోటీసులు..5 కోట్లు డిమాండ్
on Apr 15, 2025
తమిళ సూపర్ స్టార్ అజిత్(Ajith KUmar)ఈ నెల 10 న 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా చెయ్యగా, తెలుగు నాట నెంబర్ వన్ ప్రొడక్షన్ కంపెనీగా కొనసాగుతున్న'మైత్రి మూవీ మేకర్స్' అజిత్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది. తెలుగులో కూడా విడుదలైన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుపోతుంది.తమిళనాట 150 కోట్లకి పైగా వసూలైనట్టు టాక్ అయితే వస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్సకత్వం వహించాడు. ఇప్పుడు ఈ మూవీ టీం కి ఇళయరాజా(Ilaiyaraaja)నోటీసులు పంపించడం జరిగింది.
తన అనుమతి లేకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో గతంలో తాను కంపోజ్ చేసిన మూడు పాటల్ని రిఫరెన్స్ గా ఉపయోగించుకున్నారని,కాబట్టి అయిదు కోట్ల నష్టపరిహారంతో పాటు క్షమాపణలు కూడా చెప్పాలని ఇళయరాజా తన నోటీస్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది.మూవీలో మూడు సందర్భాల్లో ఇళయరాజా రిఫరెన్స్ వస్తుంది. అర్జున్ దాస్ ఇంట్రడక్షన్ లో వచ్చే 'ఓ తరువాయి తేనె’ని ఒరిజినల్ గా కంపోజ్ చేసింది ఇళయరాజానే. 1986 లో విడుదలైన 'నట్టుపుర పట్టు' సినిమాలో ఈ ట్యూన్ ఉంటుంది. అప్పట్లో ఈ సాంగ్ జానపద కళాకారులని ఒక ఊపు ఊపింది. రెండోది ‘ఎన్ జోడి మంజా కురువి అనే ట్యూన్ ని 1986 లో వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ నుంచి తీసుకున్నారు. మూడోది అజిత్ జైలు సీన్లో వచ్చే ‘ఇలామై ఇదో ఇదో’నిని 1982 లో వచ్చిన 'సకలకళా వల్లవన్' మూవీ నుంచి తీసుకున్నారు.
గతంలో మంజుమ్మల్ బాయ్స్ విషయంలో కూడా గుణ మూవీ ట్యూన్ ని వాడినందుకు ఇదే విధంగా ఇళయరాజా నష్టపరిహారం కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ఇళయరాజాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టీం ముందుగానే సంప్రదించి ఎందుకు ప్రమోషన్ తీసుకోలేదనే చర్చ కూడా తమిళ సినీ సర్కిల్స్ లో నడుస్తుంది.ఇక భారతీయ సినీ సంగీత రంగంలో ఇళయరాజా సృష్టించిన ప్రభంజనం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. సంగీతంలో ఎన్ని స్వరాలు అయితే ఉంటాయో వాటన్నిటిని ప్రేక్షకులకి అందించి సంగీత ప్రియుల హృదయాలో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 7000 కి పైగా పాటలకి స్వరాలని సమకూర్చారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
