ఐ బొమ్మ నిర్వాకుడు రవి అరెస్ట్.. అసలు ట్విస్ట్ ఇదే
on Nov 15, 2025

ఐ బొమ్మకి మైండ్ బ్లాక్
హైదరాబాద్ లో నిర్వాకుడు అరెస్ట్
ఎంక్వయిరీ లో ఏం చెప్తాడు
సినిమా అనేది అందమైన, అబ్బురపరిచే సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకి అందించడానికి విశ్వంపై అడుగిడిన ఒక అమృత సాధనం. అటువంటి అమృత తుల్యమైన సినిమాని సిల్వర్ స్క్రీన్ పై చూస్తే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి సినిమాని నిర్జీవంగా మార్చడానికి సుదీర్ఘ కాలం నుంచి ప్రయత్నిస్తున్న ఒక అసాంఘిక, ఉగ్రవాద సంస్థ ఐ బొమ్మ. ఎన్నో వ్యయప్రయాసలకి ఓర్చుకొని కొన్ని కోట్ల రూపాయల డబ్బుతో మేకర్స్ సినిమాని తెరకెక్కిస్తారు. కానీ ఐ బొమ్మ మాత్రం సదరు సినిమాలు బెనిఫిట్ షో పడటం ఆలస్యం తన సైట్ లో ఉంచుతుంది.దీని వల్ల ఎన్నో సినిమాలు ఆర్ధికంగా నష్టపోతూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఐ బొమ్మ నిర్వాకుడు రవి ఇమ్మడి ఫ్రాన్స్ దేశం నుంచి హైదరాబాద్(Hyderabad)లోని కూకట్ పల్లి(Kukatpally)ఏరియా కి వచ్చాడు. ఎప్పట్నుంచో ఐ బొమ్మ సైట్ పై నిఘా ఉంచిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ రవి ని గుర్తించి కూకట్ పల్లి లో అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఇక తమ విచారణలో రవి కరేబియన్ దీవుల్లో ఉంటు ఐ బొమ్మ సైట్ ని నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. రవి అకౌంట్ లో ఉన్న మూడు కోట్ల రూపాయలని ఫ్రీజ్ చేయడంతో పాటు మరిన్ని వివరాలని రవి నుంచి రాబడుతున్నారు.
also read: అదరగొడుతున్నశివ కలెక్షన్స్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్వీట్ వైరల్
ఇక రవి అరెస్ట్ తో సినీ కళామతల్లితో పాటు సినిమాని నమ్ముకున్న వాళ్ళల్లో పండగ వాతారణం వచ్చినట్లే అని చెప్పవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



