మన శంకర వర ప్రసాద్ గారులోని సాంగ్స్ కి అన్యాయం జరిగిందా!
on Jan 7, 2026

-మెగా సాంగ్స్ కి నిజంగానే అన్యాయం జరిగిందా!
-అసలు జరిగిందని ఎందుకు అంటున్నారు
-అంటుంది ఎవరు
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anil Ravipudi),నయనతార(Nayanthara)ల మ్యాజిక్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana shankara varaprasad Garu)తో ఈ నెల 13 న సిల్వర్ స్క్రీన్ పై మెరవడానికి సిద్దమవుతున్నవిషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హైదరాబాద్ లోని శిల్ప కళావేదికగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్ ఒకే స్టేజ్ పై కనపడి ఇద్దరి అభిమానుల్లో 2026 సంక్రాంతి జోష్ ని మరింతగా పెంచారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరి స్పీచ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
also read: మన శంకర వరప్రసాద్ గారి నుంచి వెంకీ క్యారక్టర్ రివీల్.. కర్ణాటక గౌడ్ ఎవరు!
నిన్న మూవీ నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా 'హుక్ స్టెప్'(Hook Step)సాంగ్ రిలీజ్ అయ్యింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో 'యూట్యూబ్' లో రికార్డు వ్యూస్ తో దూసుకెళ్తుంది. దూసుకెళ్లడమే కాదు అద్భుతమైన ట్యూన్, లిరిక్స్, డాన్స్ కంపోజింగ్ తో అభిమానులని, సంగీత ప్రియులని ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సాంగ్ రాకతో సోషల్ మీడియాలో సరికొత్త వాదన తెరపైకి వస్తుంది. సాంగ్ గురించి అభిమానులు, మ్యూజిక్ లవర్స్ మాట్లాడుతు హుక్ సాంగ్ వచ్చి మన శంకర వరప్రసాద్ గారు లోని మిగతా సాంగ్స్ ని వెనక్కి నెట్టింది. అంతలా హుక్ సాంగ్ మెస్మరైజ్ చేస్తుంది. అసలు ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ అన్ని కూడా ఇదే విధంగా ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి.
ఇపుడు ఆ ప్లేస్ హుక్ సాంగ్ ఆక్రమించి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనే సామెతకి ఎంత పవర్ ఉందో చెప్పింది. దీంతో మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా వచ్చిన అద్భుతమైన సాంగ్స్ కి , ఆ చిత్రంలోని సాంగ్స్ నే అన్యాయం చేసుకున్నాయని సరదా చర్చని సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మ్యూజిక్ లవర్స్ వ్యక్తం చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



