Hitler movie review: హిట్లర్ మూవీ రివ్యూ
on Nov 2, 2024
మూవీ : హిట్లర్
నటీనటులు: విజయ్ అంటోనీ, గౌతమ్ వాసుదేవన్, రియా సుమన్, రెడిన్ కింగ్స్లీ, ఆడుకలమ్ నరెన్, చరణ్ రాజ్
ఎడిటింగ్: సంగతమిజాన్
సినిమాటోగ్రఫీ: ఐ. నవీన్ కుమార్
మ్యూజిక్: వివేక్ మెర్విన్
నిర్మాతలు: డి.ఆర్ సంజయ్ కుమార్, టి.డి రజా
రచన, దర్శకత్వం: ధన శేఖరన్
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథ:
తమిళనాడులోని ఓ ప్రాంతం నుండి చెన్నైకి సెల్వ(విజయ్ అంటోనీ) ప్రయాణమవుతాడు. అతను ఓ టార్గెట్ తో అక్కడికి వస్తాడు. అదే సమయంలో సిటీలోని ఫేమస్ రాజకీయ నాయకుడు అయినటువంటి మినిస్టర్ మైఖెల్ యొక్క డబ్బుని ఓ అజ్ఞాతవ్యక్తి దొంగిలిస్తుంటాడు. దానితో పాటు అతని మనుషులు ఒక్కొక్కరుగా చంపబడుతుంటారు. ఇక ఈ కేసుని సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి డిప్యూటీ పోలీస్ కమీషనర్ (గౌతమ్ వాసుదేవన్) అప్పగిస్తారు. మరి అతని ఇన్వెస్టిగేషన్ లో మినిస్టర్ ని ఎవరు చంపాలనుకుంటున్నారో కనిపెట్టాడా? అసలు సెల్వ సిటీకి ఎందుకు వచ్చాడు. సెల్వ ప్రేమించిన అమ్మాయి ఎవరనేది తెలిసిందా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
సినిమా మొదలయ్యాక ఓ పావుగంట చూసి ఇదేదో సరైన కథలా ఉందే.. గ్రాంఢ్ గా ఉన్న విజువల్స్, మ్యూజిక్ అదీ ఖచ్చితంగా బాగుందని అనుకునే లోపే తిరిగి తిరిగి మళ్లీ అదే కథని చూపించారు. ఇప్పటికి ఎన్నో సినిమాల్లో మనం చూసిన కథలానే అనిపిస్తుంది.
విజయ్ అంటోనీ సినిమాల్లోని మెసెజ్ నచ్చుతుంది కానీ కథే ఎంగేజింగ్ గా ఉండటం లేదు. స్క్రీన్ ప్లే పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. స్టార్టింగ్ లో ఓ ఇన్సిటెండ్, మధ్యలో పొలిటీషన్స్, ఎక్కడి నుండి వచ్చాడో తెలియని హీరో.. సినిమా ఓ నలభై నిమిషాలు చూసాకే కథ అర్థమైపోతుంది. అయిన సరే హీరో ఎలవేషన్స్, లవ్ స్టోరీ అంటు సాగదీశారు. స్క్రీన్ ప్లే లో ఎంగేజింగ్ మిస్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ సాగదీత సీన్లే.
అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అయితే చివర్లో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. అది పర్లేదంటే చూసేయొచ్చు. ఇంతపెద్ద లవ్ స్టోరీ ఎందుకు అనిపిస్తుంది. ముఖ్యంగా సాంగ్స్ ప్లేస్ మెంట్ బాలేదు. కథ పరంగా ఫ్లాష్ బ్యాక్ కొత్తది కానీ మిగతాదంతా పాతదే. పర్వాలేదనిపించే ఇంటర్వెల్.. బోరింగ్ సెకెంఢ్ తో అలా వెళ్తుంది అంతే. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఒకే. బిజీఎమ్ పర్వాలేదు. ఎడిటింగ్ లో కొన్ని అనవసరపు సీన్లపై కాస్త శ్రద్ధ చూపించాల్సింది.
నటీనటుల పనితీరు:
విజయ్ అంటోనీ తన పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్ చక్కగా నటించింది. ఇక మిగతావారంతా వారి పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.
ఫైనల్ గా : గుడ్ పాయింట్ బట్ ఊహించిన కథే. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్