యుఎస్ లో నాని రికార్డు
on Apr 29, 2025
.webp)
నాచురల్ స్టార్ నాని(Nani)సినిమాలకి ఓవర్ సీస్ మార్కెట్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నెంబర్ వన్ హీరో సాధించే రేంజ్ లో ఆయన నటించిన చాలా చిత్రాలు 'వన్ మిలియన్ కలెక్షన్స్ ల క్లబ్ లో చేరాయి. ఈ క్రమంలో మే 1 న విడుదల కాబోతున్న 'హిట్ 3 '(Hit 3)ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది.
అందుకు తగ్గట్టుగానే హిట్ 3 యూఎస్ ప్రీమియర్స్ కి సంబంధించి మూడులక్షల డాలర్స్ ని ఇప్పటి వరకు రాబట్టింది. ఈ విషయాన్నీ హిట్ 3 ని యుఎస్ లో రిలీజ్ చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ అధికారకంగా వెల్లడి చేసింది. మరి తొలి రోజే రికార్డు కలెక్షన్స్ ని సాధించిన 'హిట్ 3 ' పూర్తి రన్నింగ్ లో 1 మిలియన్ దాటడం పెద్ద కష్టమైన పని కాదని చెప్పవచ్చు.
మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించిన హిట్ 3 లో నాని సరసన కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty)హీరోయిన్ గా జత కట్టగా సూర్య శ్రీనివాస్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాధ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వాల్ పోస్టర్ సినిమా, యునానమిస్ ప్రొడక్షన్స్ పై నాని, ప్రశాంతి తిప్పరనేని అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. హిట్ 1 , హిట్ 2 ,సైంధవ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను(Sailesh KOlanu)దర్శకత్వం వహించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



