Home

»

Latest News

ఆకట్టుకుంటోన్న ఆనంద్ దేవ‌ర‌కొండ‌ 'హైవే' కాన్సెప్ట్ పోస్ట‌ర్!

Dec 2, 2021 6:14PM

ఇటీవ‌ల పుష్ప‌క విమానం సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హైవే'. సైకో క్రైమ్‌ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు.. '118'తో సూపర్ హిట్ అందుకున్న కేవీ గుహ‌న్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన న‌టీన‌టుల‌ కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. 

'హైవే' సినిమాలో ఆనంద్‌ పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమాలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ నలుగురి పాత్రలకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్స్ ను మూవీ తాజాగా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ.. "ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థే  `హైవే'. పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌.  టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంది" అన్నారు.

నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com