నాని కి స్వీడిష్ అవార్డు
on May 5, 2024
నాచురల్ స్టార్ నాని హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ హాయ్ నాన్న.డిసెంబర్ 7 న విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 75 కోట్ల రూపాయిల దాకా వసూలు చేసింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అని. క్లాస్ ,మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు.లేటెస్ట్ గా ఒక అరుదైన ఘనతని సాధించింది
ప్రతి సంవత్సరం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ. ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలకి అవార్డ్స్ ని ఇస్తుంటారు. అన్ని విభాగాల్లోను ప్రకటిస్తారు. ఇప్పుడు హాయ్ నాన్న 2024 కి సంబంధించి ఆరు అవార్డుల్ని గెలుచుకుంది.మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషం వాహెబ్ కి మూడు అవార్డులు, డైరెక్టర్ శౌర్యవ్ కి రెండు ,ఇక నాని మృణాళి జోడీకి ఒక అవార్డు దక్కింది. దీంతో హాయ్ నాన్న బృందం ఫెస్టివల్ మూడ్ లో ఉంది. ప్రేమకి అసలైన ప్రతిధ్వని అంటు మేకర్స్ అవార్డు విషయాన్ని సోషల్ మీడియాలో తెలియచేసారు
హాయ్ నాన్న లో నాని, మృణాల్ తో పాటు కూతురుగా నటించిన కియారా ఖన్నా చాలా అద్భుతంగా నటించారు.అసలు నటించారు అనే కంటే జీవించారని చెప్పవచ్చు. కూతురికి ఉన్న అనారోగ్య సమస్యని తన ప్రేమతో జయించే విరాజ్ క్యారక్టర్ లో నాని, గతాన్ని మర్చిపోయి తన కూతురుతోనే స్నేహం చేసే జిష్ణ క్యారక్టర్ లో మృణాల్, తన స్నేహితురాలే తన తల్లి అని తెలిసి తల్లి మెంటల్ కండిషన్ కోసం నిజాన్ని చెప్పని మహి క్యారక్టర్ లో కియారా లు ప్రతి ఒక్క ప్రేక్షక హృదయాన్ని తడిమారు. ఆ పాత్రల యొక్క భావాన్ని ప్రేక్షకుల మనసులోకి వెళ్లేలా మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషం, దర్శకుడు శౌర్యవ్ లు విజయాన్ని సాధించారు.
Also Read