హాయ్ నాన్న మూవీ కథ ప్రాణం ఇదే
on Nov 16, 2023
నాచురల్ స్టార్ నాని అండ్ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం హాయ్ నాన్న. నాని నటిస్తున్న 30 వ చిత్రం ఈ హాయ్ నాన్న. ఈ సినిమా మీద నాని అభిమానుల్లోను ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా హాయ్ నాన్న చిత్రానికి సంబంధించిన మెయిన్ పాయింట్ ఇదే అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
హాయ్ నాన్న సినిమా కథ ఎమోషనల్ కంటెంట్ తో కూడుకున్న కథ అని ఆ కంటెంట్ ఒక లెవల్లో కుదిరందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినపడుతుంది. అలాగే సినిమా మొత్తం మీద హైలెట్ అయ్యేది కూడా ఎమోషనల్ కంటెంటే అని కూడా అంటున్నారు. అలాగే యూనిట్ అనుకున్న దానికన్నా సినిమా బాగా వచ్చిందనే మాటలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు హాయ్ నాన్న గురించి వస్తున్న ఈ వార్తలతో నాని అభిమానులు ఫుల్ హుషారులో ఉన్నారు.
ఆల్రెడీ హాయ్ నాన్న మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.మూవీ ప్రమోషన్స్ కూడా హాయ్ నాన్న సినిమా మీద ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ ని కలిగించాయి. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 7 న హాయ్ నాన్న ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి , తీగల విజేందర్ రెడ్డి అండ్ మూర్తి లు నిర్మించారు. శౌర్యువ్ దర్శకుడుగా పరిచయమవుతున్న ఈ మూవీ కి హీషం అబ్దుల్ వహద్ సంగీతాన్ని అందించాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
