తన లవ్ ఎఫైర్ గురించి ఓపెన్ అయిన తాప్సీ!
on Jan 19, 2024
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగినవారు చాలా మంది వున్నారు. వారిలో తాప్సీ ఒకరు. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమై ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్ ఎగిరిపోయిన తాప్సీ అక్కడ మంచి సినిమాల్లో అవకాశాలు సాధించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. హిందీతోపాటు తమిళ్, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. తాజాగా షారూక్ ఖాన్ సినిమా ‘డంకీ’లో కీలకమైన పాత్రలో కనిపించింది. ఆ సినిమా ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చింది.
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్‌బో, తాప్సీ లవ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ తన ప్రేమ వ్యవహారం గురించి ఓపెన్ అయింది. ‘మాథిస్ బోతో పది సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నాను. నేను బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంవత్సరమే మాథిస్‌ను కలిశాను. అప్పటి నుంచి అతనితోనే డేటింగ్‌లో ఉన్నాను. అతన్ని విడిచి పెట్టాలని, మరొకరితో ప్రేమలో పడాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే మేం చాలా సంతోషంగా ఉన్నాం. మా బంధం చాలా స్ట్రాంగ్ అని నా ఫీలింగ్. నేను అతన్నే ఇష్టపడడానికి కారణం.. అతను 100 పర్సెంట్ జెన్యూన్. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. నాకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను’ అని వివరించింది తాప్సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



