రాక రాక ఒక హిట్టొచ్చింది.. ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడట?
on Feb 27, 2024
2003లో ‘బోయ్స్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఆ తర్వాత టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో లవర్‌బోయ్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల్ని అలరించాడు. తెలుగు, తమిళ్‌లో అతనికి మంచి మార్కెట్ ఉంది. ఒకప్పుడు సిద్ధార్థ్ హీరోగా చాలా బిజీ. ఒక సంవత్సరం అతను హీరోగా నటించిన 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీప్ వద్ద బోల్తా కొట్టడంతో ఇప్పుడు అడపా దడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నాడు. గత ఏడాది వచ్చిన ‘చిత్తా’ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో సిద్ధార్థ్‌కి హీరోగా మంచి పేరు వచ్చింది. తెలుగులో ‘చిన్నా’ పేరుతో రిలీజ్ అయి ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అతనితో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తున్నారు. అయితే తాజాగా అతను ఓకే చేసిన ప్రాజెక్ట్ గురించి తెలిస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది.
సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ‘లాల్ సలామ్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమాలో రజినీ గెస్ట్‌గా కనిపిస్తాడని ప్రచారం చేశారు. అయితే సినిమాలో మాత్రం ప్రధాన పాత్రలా కనిపించేంత లెంగ్త్‌లో రజిని నటించారు. ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన ‘లాల్ సలామ్’ చాలా పెద్ద హిట్ అవుతుందనుకున్నారు. కానీ, ఫలితం తారుమారైంది. అయినా సరే మరో సినిమా చేసేందుకు ఐశ్వర్య రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. చాలా ఫ్లాపుల తర్వాత హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు అందరూ ఆశ్యర్యపోతున్నారు. ఐశ్వర్య చెప్పిన స్క్రిప్ట్ తనకు నచ్చిందని చెబుతూ కథలో కొన్ని మార్పులు చెయ్యాలని సూచించాడట. మరి ఈ సినిమా సిద్ధార్థ్‌కి, ఐశ్వర్య రజినీకాంత్‌కి ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.