అసిస్టెంట్ కు బైక్ గిఫ్ట్ ఇచ్చిన యంగ్ హీరో
on Mar 6, 2016
తారల్ని అభిమానించే వారికి లెక్కుండదు. తమ ఫేవరెట్ హీరోల కోసం, ఎంతైనా ఖర్చుపెడతారు అభిమానులు. దీనికి తారలు మినహాయింపు కాదు. వాళ్లు కూడా తాము అభిమానించే వారి కోసం ఖర్చు పెడతారు. రీసెంట్ గా మహేష్, ఎన్టీఆర్ లు కొరటాల శివకు గిఫ్ట్ ఇచ్చారు. గతంలో కూడా ఎంతో మంది స్టార్స్ తమకు నచ్చిన వారికి గిఫ్ట్ లు ఇచ్చారు. లేటెస్ట్ గా తన అసిస్టెంట్ కు బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్. తన దగ్గర చాలా కాలంగా అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరసింహ అనే అతనికి, బజాజ్ బైక్ ను గిఫ్ట్ గా కొన్నాడు. కొన్న తర్వాత దాని మీద కూర్చుని ఫోటో దిగి, తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం నిఖిల్, విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఫాంటసీ సినిమాగా తెరకెక్కనుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
