చుట్టాలబ్బాయిపై మండిపోతున్న ఆ సామాజిక వర్గం
on Aug 19, 2016
ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ చుట్టాలబ్బాయి. వీరభద్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ధియేటర్లలో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా రీలీజ్‌కు ముందు విడుదల చేసిన ట్రైలర్లో హీరో ఆది చెప్పే డైలాగ్ వివాదానికి కారణమైంది. "ఈగో రెడ్డి అంటే గోనగన్నా రెడ్డిలా ఉంటాడనుకున్నా..గోనేసంచిలమ్ముకునేవాడిలా ఉన్నాడేంట్రా" అని ఆది చెప్పిన డైలాగ్ తమ సామాజిక వర్గాన్ని అవమానించినట్లుగా ఉందని, సినిమాలో ఆ డైలాగ్ తొలగించాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. అయితే ఈ విషయమై దర్శకుడు వీరభద్రం కానీ హీరో ఆది కానీ ఇంకా మాట్లాడలేదు.