మీ టూ... హీరోల పేర్లు చెప్పే దమ్ముందా?
on Oct 25, 2018
'మీ టూ' హాట్ టాపిక్... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెగలు రేపుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందోనని మీడియా ఆతృతగా ఎదురు చూస్తుంటే... సినిమా జనాలు తమ పేరు ఎక్కడ వస్తుందోనని, ఎవరు తమను అన్యాయంగా అప్రతిష్ట పాలు చేస్తారోనని టెన్షన్ పడుతున్నారు. తమను ఫలానా వ్యక్తి లైంగికంగా వేధించారని మీడియా ముందుకొస్తున్న హీరోయిన్లకు, ఫిమేల్ ఆర్టిస్టులకు చాలామంది బాసటగా నిలుస్తున్నారు. అయితే... కన్నడ హీరోయిన్ హర్షికా పూనాచా మాత్రం 'మీ టూ' ఆరోపణలు చేసిన, చేస్తున్న హీరోయిన్లపై నిప్పులు చెరిగారు. కన్నడలో సుమారు 20కు పైగా సినిమాల్లో నటించారీమె. మాటలు చెప్తున్న సోకాల్డ్ హీరోయిన్లు ఎవరికైనా ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోల పేర్లు చెప్పే దమ్ము వుందా? అని ఆమె ప్రశ్నించారు. అలాగే, స్టార్ హీరోయిన్లు మౌనంగా ఎందుకు వుంటున్నారని నిలదీశారు. అంతటితో హర్షికా పూనాచా ఆగలేదు.
'మీ టూ' ఆరోపణలు చేస్తున్న హీరోయిన్లు అవార్డు ఫంక్షన్స్ కోసం సింగపూర్, దుబాయ్ వెళ్లి ఏం చేశారో తనకు తెలుసునని హర్షికా పూనాచా అన్నారు. కొన్ని విషయాలు చెప్పలేక వదిలేస్తున్నానని పేర్కొన్నారు. కెరీర్ స్టార్టింగులో ఎదుగుదల కోసం, పేరు కోసం, డబ్బు కోసం పురుషులకు ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ల కోరికలు తీర్చడానికి అంగీకరించి... తరవాత వారిపైనే ఒక స్థాయికి వచ్చాక హీరోయిన్లు ఆరోపణలు చేస్తున్నారని హర్షికా పూనాచా సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు కొంతమంది మేల్ ఆర్టిస్టులను వాడుకుని వదిలేసినట్టు ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఈ కన్నడ హీరోయిన్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇండియా అంతటా పెద్ద చర్చకు తెర తీసింది. మేల్ ఆర్టిస్టులు 'వుయ్ టూ' అని తమను వాడుకుని వదిలేసిన హీరోయిన్ల గురించి చెప్పాలని, 'వుయ్ టూ' మూమెంట్ స్టార్ట్ చేయాలని ఆమె అభిప్రాయపడింది.