Pawan Kalyan: వీరమల్లు మళ్ళీ వాయిదా.. అడగలేని పరిస్థితిలో మేకర్స్!
on Apr 9, 2025

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా పలుసార్లు వాయిదా పడింది. మే 9న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ అటు ఇటుగా ఒక వారం రోజులు డేట్స్ కేటాయిస్తే మొత్తం సినిమా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్.. ఈ నెలలో ఎలాగైనా వీరమల్లుకి కాస్త సమయం కేటాయించి, చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు. కానీ, ఇప్పుడు అది సాధ్యపడకపోవచ్చు.
సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ సింగపూర్ కి వెళ్ళారు. చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ పట్టేయడంతో మార్క్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది. దీంతో పవన్ కొద్దిరోజులు సింగపూర్ లోనే ఉంటారని సమాచారం. అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ ప్రభుత్వ కార్యకలాపాలతో బిజీ అవుతారు.
మే 9 కి సరిగ్గా నెలరోజులే సమయముంది. ఒకవైపు ఆసుపత్రిలో కుమారుడు, మరోవైపు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు. ఇలాంటి సమయంలో పవన్ షూటింగ్ కోసం వారం రోజులు కేటాయించడం అసాధ్యమనే చెప్పాలి. నిర్మాతలు సైతం ఈ సమయంలో పవన్ దగ్గర షూట్ ప్రస్తావన తీసుకొచ్చే అవకాశమే లేదు. ఈ లెక్కన మే 9కి వీరమల్లు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



