'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ అదిరిపోయింది!
on Oct 1, 2023
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల 'స్కంద'కి తమన్ అదిరిపోయే సాంగ్స్ ఇవ్వకపోవడంతో.. గుంటూరు కారం విషయంలో ఏం చేస్తాడనే టెన్షన్ మహేష్ ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ఇప్పటికే 'గుంటూరు కారం' రెండు పాటల రికార్డింగ్ పూర్తయిందని, రెండు పాటలూ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. మొదటి పాట దసరా లోపు విడుదల కానుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ అదిరిపోయిందట. ఇన్ స్టాంట్ చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయమని అంటున్నారు. త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురములో' చిత్రానికి తమన్ స్వరపరిచిన పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మరోసారి ఆ స్థాయి ఆల్బమ్ రానుందని చెబుతున్నారు.
Also Read