ఇది బాబు బాక్సాఫీస్ స్టామినా.. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల ఊచకోతే!
on Jan 16, 2024
'అతడు', 'ఖలేజా' తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. ఈ మూవీ డివైడ్ సొంతం చేసుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.38.88 కోట్ల షేర్, రెండో రోజు రూ.8.57 కోట్ల షేర్, మూడో రోజు రూ.9.01 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.9.47 కోట్ల షేర్ రాబట్టిన గుంటూరు కారం.. నాలుగు రోజుల్లో రూ.65.93 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే నాలుగు రోజుల్లో నైజాంలో రూ.28.25 కోట్ల షేర్ , సీడెడ్ లో రూ.7.28 కోట్ల షేర్ , ఆంధ్రాలో రూ.30.40 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.5.30 కోట్ల షేర్, ఓవర్సీస్ లో రూ.13.15 కోట్ల షేర్ కలిపి.. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.84.38 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
రూ.132 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన గుంటూరు కారం.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు రూ.52.03 కోట్ల షేర్, రెండో రోజు రూ.11.12 కోట్ల షేర్, మూడో రోజు రూ.10.86 కోట్ల షేర్, నాలుగో రోజు రూ.10.37 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.48 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. నేటితో సంక్రాంతి సెలవలు ముగుస్తుండటంతో మరో రూ.20 కోట్ల దాకా షేర్ సాధించే అవకాశముంది. అంటే ఈ సినిమా ఫుల్ రన్ లో రూ.100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయనుంది. ఒక రీజినల్ సినిమా.. అందునా డివైడ్ టాక్ తో ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం మహేష్ బాబుకే సాధ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
'గుంటూరు కారం' మూవీ 4 రోజుల వసూళ్లు:
నైజాం: రూ.28.25 కోట్ల షేర్
సీడెడ్: రూ.7.28 కోట్ల షేర్
ఆంధ్రా: రూ.30.40 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల వసూళ్లు: రూ.65.93 కోట్ల షేర్
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: రూ.5.30కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.13.15 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల వసూళ్లు: రూ.84.38 కోట్ల షేర్
Also Read