గోపీచంద్ హీరోనా? కమెడియనా??
on Dec 19, 2015
సినిమాల్లో కామెడీ ఉండాల్సిందే.. ఎంటర్‌టైన్ మెంట్ లేకపోతే.. సినిమా గట్టెక్కడం లేదు. నిజమే.. కాకపోతే కండలు తిరిగిన హీరోలు, మాస్ ఇమేజ్ వచ్చిసిన వాళ్లూ కామెడీ తప్ప మరోటి చేయలేం అన్నట్టు వ్యవహరించడం అసలు సిసలు కామెడీ. గోపీచంద్‌నే తీసుకోండి. ఇది వరకు గోపీచంద్ అంటే.. మాస్ యాక్షన్ మసాలా. ఫైట్లు, ఫీట్లూ ఇరగదీసేవాడు. మాస్ డైలాగులు తెగ చెప్పేవాడు. ఇప్పుడు ఆయన కూడా కామెడీ రూట్లోకొచ్చేశారు. మొన్నామధ్య రిలీజ్ అయిన.. లౌక్యం ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. ఆ సినిమాలో గోపీచంద్ మార్కు యాక్షన్ కంటే వినోదమే ఎక్కువ. 30 ఇయర్స్ ఫృద్వీ తో నడిపించిన కామెడీ ట్రాక్ .. లౌక్యంని నిలబెట్టింది. ఇప్పుడాయన మళ్లీ ఫృద్వీనే నమ్ముకొన్నాడు.
గోపీచంద్ సినిమా సౌఖ్యం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఆమధ్య విడుదలైంది. అది చూస్తే.. గోపీచంద్‌ని హీరో అంటే ఎవ్వరూ నమ్మరు. కామెడీ గ్యాంగ్‌లో తానూ ఒక్కడిగా కనిపిస్తాడంతే. ఈ సినిమా కూడా 30 ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృద్వీని నమ్మకొందని స్పష్టంగా అర్థం అవుతోంది. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకొందీ.. అంటూ బాహుబలిలోని పాటని ఫృద్వీపై పేరడీగా తీశారు. ట్రైలర్‌లో గోపీచంద్ అక్కడక్కడ మెరిశాడంతే. సిక్స్ ఫీటున్న గోపీచంద్ లాంటి హీరోలు కామెడీని నమ్ముకొంటే.... కామెడీ చేయగలిగిన సునీల్ లాంటివాళ్లు యాక్షన్‌ని నమ్ముకొంటున్నారు. ఇదే అసలు సిసలైన కామెడీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
