ENGLISH | TELUGU  

టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. ఎందుకు అలా చేస్తున్నారు

on Feb 5, 2026

 

-వివాదంలో ఘూస్‌ఖోర్ పండత్
-అసలు  ఘూస్‌ఖోర్ పండత్ అనే అర్ధం ఏంటి!
-ఎవరు ఎవర్ని టార్గెట్ చేశారు


తెలుగు సినిమా ప్రేమికులు 'మనోజ్ బాజ్ పేయి'(Manoj Bajpayee)పేరు చెప్పగానే చాలు, విలక్షణమైన పెర్ ఫార్మెన్స్ కి పేటంట్ హక్కు తీసుకున్న యాక్టర్ కదా అంటారు. పైగా తన గురించి మనం ఏం చెప్పబోతున్నామో పూర్తిగా వినకుండానే సదరు మూవీ లవర్స్ ఎంతో ఆనందంతో 'సత్య మూవీలోని బీకు మాత్రే, ప్రేమకథ లోని శంకరం, అల్లు అర్జున్  హ్యాపీ లోని డిసిపి అరవింద్, పవన్ కళ్యాణ్  పులి లోని ఏ ఐ సలీం, వేదం లోని రహీముద్దీన్ ఖురేషి క్యారెక్టర్స్ లలో మనోజ్ బాజ్ పేయి ఒక రేంజ్ లో  చేసాడు కదా అని స్టార్ట్ చేస్తారు.ఆయన పెర్ ఫార్మెన్స్ కి   అంత రేంజ్ ఉంది. బాలీవుడ్ తో పాటు వెబ్ సిరీస్ లలో కూడా పెర్ ఫార్మెన్స్ కి ఉన్న పదును ఏ మాత్రం తగ్గకుండా అభిమానులు గర్వపడేలా రాణిస్తూ ఉన్నాడు. ఈ కోవలోనే 'ఘూస్‌ఖోర్ పండత్’(Ghooskhor Pandat)అనే మూవీతో నెట్ ఫ్లిక్స్ వేదికగా రావడానికి ముస్తాబు అవుతున్నాడు.  మూడవ తారీఖున టీజర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ బ్రాహ్మణ కమ్యూనిటీ ఆగ్రహ జ్వాలలకి గురవుతుంది. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.

 

ఘూస్‌ఖోర్ పండత్.. పండత్ లేదా పండిత్ అనే వర్డ్  బ్రాహ్మణ కమ్యూనిటీ కి గుర్తింపు. ఘూస్‌ఖోర్ అంటే లంచగొండి అని అర్ధం. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బ్రాహ్మణులని అవమానించడానికే ఈ విధమైన టైటిల్ ని ఫిక్స్ చేసారు. వెంటనే ఘూస్‌ఖోర్ పండత్ అనే టైటిల్ ని తొలగించక పోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఈ రకమైన టైటిల్ ని ఉపయోగించగలరా! హీరో క్యారక్టర్ పేరు అజయ్ దీక్షిత్ అనే పేరు కూడా మార్చాలని హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్ట్ లో ఈ విషయంపై బ్రాహ్మణ సంఘాలు పిటిషన్ కూడా నమోదు చేసాయి. అయితే ఇంకా ఈ ఇష్యుపై  మనోజ్ బాజ్ పేయి గాని చిత్ర బృందం గాని  స్పందించలేదు.

 

Also read: 16 ఏళ్ళ లోపు పిల్లల విషయంలో అందరు ఈ పని చెయ్యాలి..సోను సూద్ డిమాండ్  
 

ఘూస్‌ఖోర్ పండత్ లో అజయ్ దీక్షిత్ అనే బ్రాహ్మణ వర్గానికి చెందిన పోలీసు అధికారి గా    మనోజ్ బాజ్‌పేయి చేస్తున్నాడు.దీక్షిత్ ముద్దు పేరు పండత్. అవినీతి, కోపం, క్రూరత్వంతో నిండిన పోలీసు అధికారి గా చేస్తున్నాడని టీజర్ లో చాలా స్పష్టంగా చెప్పారు.రితేష్ షా దర్శకత్వంలో నీరజ్ పాండే నిర్మించాడు. అతిరధ మహారధులు కనిపిస్తున్న ఈ మూవీ ట్రయిలర్ ఈ రోజు రిలీజ్ కావాలి. కానీ నిరసనల మధ్య రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.  రిలీజ్ డేట్ కూడా ఇంకా ప్రకటించలేదు.

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.