మణిరత్నం గీతాంజలి అనుకున్నానే.. కాదు.. కోన వెంకట్ గీతాంజలివే.. దెయ్యంలా తగులుకున్నావ్!
on Apr 3, 2024
అంజలి, శ్రీనివాస్‌రెడ్డి, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘గీతాంజలి’ చిత్రం 2014లో విడుదలై ఘనవిజయం సాధించింది. రూ.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.10 కోట్లు కలెక్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. కథ, కథనాల్లో వైవిధ్యం, నటీనటుల పెర్‌ఫార్మెన్స్, చక్కని హాస్య సన్నివేశాలు ఈ సినిమాకి ఘనవిజయాన్ని అందించాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చిత్రాన్ని రూపొందించారు. అంజలి, శ్రీనివాస్‌రెడ్డి, సునీల్, రవిశంకర్, సత్య, అలీ, సత్యం రాజేష్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎం.వి.వి., జి.వి. సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ హీరోయిన్ అంజలి నటించిన 50వ సినిమా కావడం విశేషం.
‘గీతాంజలి’ చిత్రంలో ఒక సినిమా కోసం కథ తయారు చేసుకునే క్రమంలో ఒక ఆత్మ తారసపడడం, దాని ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా తోడవుతాయి. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో సినిమా షూటింగ్ కోసం ఒక పాడుబడ్డ బంగ్లాకి చేరుకున్న యూనిట్‌కి నిజమైన ఆత్మలు తారసపడతాయి. వాటితో ట్రావెల్ అయ్యే యూనిట్ సభ్యులు ఎలాంటి భయానికి లోనవుతారు. దాని ద్వారా ఎలాంటి ఫన్ క్రియేట్ అవుతుందనే కాన్సెప్ట్‌తో ‘గీతాంజలి’ మళ్ళీ వచ్చింది’ రూపొందింది. ఈ సినిమాలో కూడా కామెడీ క్రియేట్ అయ్యే చక్కని డైలాగులు ఉన్నాయి. ఆర్టిస్టులు కూడా పెర్‌ఫార్మెన్స్ ఇరగదీశారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
‘ఓ బోయపాటి శీను, ఓ త్రివిక్రమ్ శీను, ఓ వైట్ల శీను, ఓ శనక్కాయల శీను.. ఈ శీన్లందరూ కలిసి సీన్ చెబితే స్క్రీన్ సిరిగిపోద్ది..’, ‘నేను మణిరత్నం గీతాంజలివి అనుకున్నానే.. కాదు, నువ్వు కోన వెంకట్ గీతాంజలివే.. దెయ్యంలా తగులుకున్నావ్’, ‘నువ్వు పుష్ప అయితే.. నేను ట్రిపులార్..’ వంటి డైలాగులు చాలా ఫన్నీగా ఉన్నాయి. కథ, కథనాలు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయనిపిస్తుంది. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ, ఛోటా కె.ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగున్నాయి. ‘గీతాంజలి’లాగే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ కూడా ఆడియన్స్‌కి కనెక్ట్ అయి మరో సూపర్‌హిట్ సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read