"వాశిష్టిపుత్ర పులోమావి"గా నందమూరి మోక్షజ్ఞ ..?
on Jan 19, 2017

నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై గతంలో చాలా వార్తలు వచ్చాయి. రేపో మాపో ఆయన ఎంట్రీ ఖాయం అంటూ పలు కథనాలు వచ్చాయి. బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిలో మోక్షజ్ఞ కీలకపాత్ర చేయబోతున్నాడని కూడా ప్రచారం జరిగింది..కానీ వీటిలో ఒక్కదానిలో కూడా నిజం లేదని తేలిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం తనకు శాతకర్ణి లాంటి గొప్ప విజయాన్ని అందించిన క్రిష్ చేతుల మీదుగా మోక్షజ్ఞను అరంగేట్రం చేయించాలనుకుంటున్నాడట బాలయ్య.
గౌతమీపుత్ర శాతకర్ణి తనయుడు వాశిష్టిపుత్ర పులోమావి జీవితకథతో తెరకెక్కనున్న సినిమాలో మోక్షజ్ఞ నటించనున్నాడని నందమూరి కాంపౌండ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య శాతకర్ణిగా చేశారు కాబట్టి..ఆ సినిమాకు సీక్వెల్‌గా చేసే పులోమావిలో మోక్షజ్ఞ నటిస్తేనే బావుంటుందని సినీ జనాలు అంటున్నారు. మరి విషయం ఏంటనేది బాలయ్య నోటివెంట వినాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



