ఈ గౌడ్ సాబ్ ని మీరంతా ఆశీర్వదించండి
on Jan 4, 2025
కొరియోగ్రాఫర్లు, కమెడియన్స్ డైరెక్టర్లుగా మారిన సందర్భాలు ఇంతకుముందు చాలానే చూశాం మనమంతా. లైక్ ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్, బలగం వేణు, రాకింగ్ రాకేష్ ఇలా ఎంతోమంది స్టార్ కొరియోగ్రాఫర్లు, కమెడియన్లు మెగాఫోన్ పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా గణేష్ మాస్టర్ ఆ లిస్ట్‌లో చేరారు. ఆయన త్వరలో ఒక మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. రైటర్ గా డైరెక్టర్ గా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఒక చిట్ చాట్ లో ఆయన తన మూవీ గురించి కొన్ని విషయాలు చెప్పారు. "గౌడ్ సాబ్" అనే మూవీ నా ఆధ్వర్యంలో రాబోతోంది. కథ రాసింది నేనే డైరెక్ట్ చేస్తోంది కూడా నేనే. ఒక షెడ్యూల్ ఐపోయింది. త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతోంది. ఆ సినిమా చాలా బాగుంటుంది.
మీ అందరికీ బాగా నచ్చుతుంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంతవరకు నన్ను డాన్సర్ గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా, కొరియోగ్రాఫర్ గా ఎంకరేజ్ చేస్తూ ఆశీర్వదించారో ఇక ఇప్పుడు డైరెక్టర్ మారబోతున్న నన్ను మళ్ళీ మీరంతా ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఎక్కడా కూడా డిజప్పాయింట్ చేయను. నా ఈ మూవీలో హీరో ఎవరంటే ప్రభాస్ గారి తమ్ముడి వరసయ్యే విరాట్ రాజు." అని చెప్పారు. ఇక గణేష్ మాష్టర్ 2017 లో వచ్చిన దువ్వాడ జగన్నాధం మూవీలో “బాక్స్ బద్దలైపోయే ” 2015 లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తిలో “ సీతాకాలం సూర్యుడిలాగా ”, 2015 లో వచ్చిన గోపాల గోపాల, గబ్బర్ సింగ్ మూవీలో టైటిల్ సాంగ్ , “ భజే బాజే ”, ఆర్య 2 " మై లవ్ ఈజ్ గాన్ " వంటి అనేక హిట్ సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేశారు.
Also Read