సంక్రాంతికి హిట్ అయ్యే సినిమా ఇదే
on Jan 4, 2025
ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి కూడా బడా హీరోల సినిమాలు ప్రేక్షకులని కనువిందు చెయ్యడానికి సిద్ధమవుతున్నాయి.ఇద్దరు సీనియర్ హీరోలైన బాలకృష్ణ(Balakrishna)వెంకటేష్(Venkatesh)తో రామ్ చరణ్(Ram charan)పోటీ పడుతున్నాడు.ముందుగా చరణ్ జనవరి 10 న గేమ్ చేంజర్(Game changer)తో వస్తుండగా,12 న బాలకృష్ణ 'డాకు మహారాజ్'(Daku maharaj)తో 14 న వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankrathiki vasthunnam)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
జనరల్ గా ఏ హీరో అభిమానులైన తమ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడం సహజం.బాలయ్య,వెంకీ,చరణ్ అభిమానులు కూడా ఇదే తరహాలో ఆలోచించడం కామన్.కానీ ఇందుకు భిన్నంగా గేమ్ చేంజర్,డాకుమహారాజ్,సంక్రాంతికి వస్తున్నాం మూడు సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.ముగ్గురు హీరోలు కూడా ఇపుడు తమ సినిమాల ప్రమోషన్స్ లో మూడు సినిమాలు బాగా ఆడి, అంతిమంగా సినిమా గెలవాలని చెప్తున్నారు.దీంతో ముగ్గురు హీరోల అభిమానులు కూడా తమ హీరోల దారిలోనే సినిమా గెలవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
ఇక బాలయ్య,వెంకీ, చరణ్ తమ సినిమాల ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.చరణ్ ఈ రోజు రాజమండ్రిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటుండగా,బాలకృష్ణ యుఎస్ లో జరుగుతున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటున్నాడు.వెంకటేష్ కూడా తన యూనిట్ తో కలిసి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.మూడు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లో తెరకెక్కాయి.
Also Read