ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే న్యూస్!
on Jan 22, 2024

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గేమ్ ఛేంజర్'(Game Changer). శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో 'గేమ్ ఛేంజర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే 'ఇండియన్-2' కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. దానికితోడు అసలు 'గేమ్ ఛేంజర్' ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై క్లారిటీ లేక, సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రాక చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలవుతుందని ఆ మధ్య నిర్మాత దిల్ రాజు చెప్పినప్పటికీ.. అభిమానులకు నమ్మకం కలగలేదు. అయితే ఎట్టకేలకు వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ వినిపిస్తోంది.
'గేమ్ ఛేంజర్'ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ, ఈ సినిమా విషయంలో చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ముందే చరణ్ ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించడంతో మా హీరో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడని అప్పుడు ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి దర్శకుడు శంకర్ 'ఇండియన్-2'తో బిజీ కావడంతో 'గేమ్ ఛేంజర్' షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన సరైన అప్డేట్స్ కూడా లేవు. దీంతో ఇక ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావడం కష్టమేనని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చరణ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చే న్యూస్ వైరల్ గా మారింది.
'గేమ్ ఛేంజర్' మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 6న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే విడుదలకు ఇంకా ఏడు నెలల సమయముంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రూపొందుతోన్న 'ఇండియన్-2'ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత తన పూర్తిగా ఫోకస్ ని 'గేమ్ ఛేంజర్' పైనే పెట్టనున్నాడు శంకర్. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. పక్కా ప్లానింగ్ తో మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తిచేసి, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ లోనే విడుదల చేయాలని చూస్తున్నారట. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ చేయనున్న 16వ సినిమా కూడా మార్చిలో పట్టాలెక్కే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



