గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4..చిరు, పవన్,చరణ్ ఒకే స్టేజ్ పై
on Jan 2, 2025
సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)ఈ నెల పదిన 'గేమ్ చేంజర్'(game changer)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతున్న ఈ మూవీకి శంకర్(shankar)దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.యుఎస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయితే అందరిలోను 'గేమ్ చేంజర్' పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి.ఇక కొన్ని రోజుల క్రితం విజయవాడ లో రామ్ చరణ్ భారీ కట్ అవుట్ ని నిర్మాత దిల్ రాజు లాంచ్ చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఈ నెల మూడు లేదా నాలగవ తేదీల్లో ఏపి లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.
అందుకు తగ్గట్టుగానే ఈనెల 4 న రాజముండ్రి లో 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(pawan kalyan)హాజరవుతున్నాడు.దీంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.చరణ్,పవన్ లు కలిసి గతంలో 'రంగస్థలం' మూవీ ఫంక్షన్ లో పాల్గొన్నారు.అప్పుడు ఆ ఇద్దరి స్పీచ్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తర్వాత ఇద్దరు ఎప్పడు కూడా బహిరంగ వేదికల్లో కనపడలేదు.దీంతో గేమ్ చేంజర్ ఈవెంట్ లో ఆ ఇద్దరి స్పీచ్ మీద అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.మెగా స్టార్ చిరంజీవి(chiranjeevi)కూడా ఈ ఈవెంట్ కి వస్తాడనే వార్తలు వస్తున్నాయి.అదే జరిగితే రాజమండ్రిలో జరిగే ఫంక్షన్ మెగా ఫ్యాన్స్ కి ఒక మర్చిపోలేని ఈవెంట్ గా మారడం ఖాయం.
ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి.మహిళలకి చీరల పంపిణీతో పాటు,మూవీలోని చరణ్ ఫాదర్ గెటప్ తో వెయ్యి మంది రాజముండ్రి లో వాకింగ్ ని కూడా చేపడుతున్నారు.'జె' మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకి జిల్లా ఎస్ పి ఆధ్వర్యంలో పోలీసులు చెక్ చేసి పలు సూచనలు చెయ్యడం జరిగింది.
చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతున్న గేమ్ చేంజర్ లో అంజలి,ఎస్ జె సూర్య,శ్రీకాంత్,సునీల్,నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
Also Read