రికార్డు స్థాయిలో 'గేమ్ ఛేంజర్' బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే...
on Jan 9, 2025
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.221 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.
'గేమ్ ఛేంజర్' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.122 కోట్ల బిజినెస్ చేసింది. ఏరియాల వారీగా చూస్తే.. నైజాంలో రూ.43.50 కోట్లు, సీడెడ్ లో రూ.23 కోట్లు, ఆంధ్రాలో రూ.55.50 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ.14.50 కోట్లు, తమిళనాడులో రూ.15 కోట్లు, కేరళలో రూ.2 కోట్లు, హిందీ+రెస్టాఫ్ ఇండియా రూ.42.50 కోట్లు, ఓవర్సీస్ రూ.25 కోట్లు కలిపి.. ఓవరాల్ గా రూ.221 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.221 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. గ్రాస్ పరంగా చూస్తే రూ.450 కోట్ల దాకా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లో ఇదే అత్యధిక బిజినెస్. రూ.90 కోట్లతో 'వినయ విధేయ రామ' ఇప్పటివరకు టాప్ లో ఉంది. చరణ్ నటించిన మల్టీస్టారర్ సినిమాలను గమనిస్తే.. ఆర్ఆర్ఆర్ రూ.450 కోట్లు, ఆచార్య రూ.130 కోట్లు బిజినెస్ చేశాయి.
Also Read