గేమ్ చేంజర్ లో ఈ క్యారెక్టర్ హైలెట్ అంట!.ఎవరని ఉద్దేశించి ఆ క్యారెక్టర్ చేసారో తెలుసా
on Jan 9, 2025
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)శంకర్(Shankar)కలయికలో తెరకెక్కిన'గేమ్ చేంజర్'(Game Changer)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోస్ ప్రారంభమవ్వగా,మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా మూవీ చూడటానికి థియేటర్స్ కి పోటెత్తారు.
రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా చాలా బాగా చేసాడని,ఐపీఎస్ ఆఫీసర్ గా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో పాటు,అప్పన్న క్యారక్టర్ లో కూడా బాగా చేసాడని,ముఖ్యంగా ఎంటైర్ తన కెరీర్ లోనే అద్భుతమైన పెర్ ఫార్మ్ ని ఆ క్యారక్టర్ ద్వారా ఇచ్చాడని,అప్పన్న క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా చెయ్యడంతో పాటు,ఆ క్యారక్టర్ తీరు తెన్నులు పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ భావాలని ఉద్దేశించి చేసిందనే అభిప్రాయాన్ని పవన్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్(Sreekanth)క్యారెక్టర్ కూడా చాలా బాగుందని,కథలో చాలా కీలకమైన క్యారెక్టర్ చేసాడనే మాటలు కూడా వినపడుతున్నాయి.ఇక మిగతా పాత్రలో చేసిన కియారా అద్వానీ(Kiara adwani)అంజలి(Anjali)ఎస్ జె సూర్య,సముద్ర ఖని తదితర నటులందరు కూడా తమ క్యారెక్టర్స్ లో చాలా చక్కగా చేసారని,థమన్ సంగీతం,తిరు ఫొటోగ్రఫీకి కూడా సినిమాకి అదనపు బలం చేకూరిందని అంటున్నారు.