నా లవ్‌ను కనుగొన్నాను.. వరుణ్‌తేజ్ ఆనందం!
on Jun 10, 2023
ప్రేమికులు వరుణ్‌తేజ్ కొణిదెల, లావణ్యా త్రిపాఠి వివాహ నిశ్చితార్ధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం రాత్రి నాగబాబు ఇంట్లో జరిగిన వేడుకలో ఆ ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. 2016లో 'మిస్టర్' సినిమాలో కలిసి నటించినప్పట్నుంచీ ఆ ఇద్దరి మధ్యా పెనవేసుకున్న ప్రేమబంధం అంతకంతకూ బలపడుతూ వచ్చింది. అయితే నిశ్చితార్ధం జరిగే వరకూ తమ మధ్య బంధాన్ని ఆ ఇద్దరూ బహిర్గతం చెయ్యలేదు.
కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం కొద్దికాలం క్రితం బయటపడింది. అప్పట్నుంచీ వారు పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. మణికొండలోని నాగబాబు ఇంట్లో జరిగిన నిశ్చితార్ధానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వరుణ్‌తేజ్ నాయనమ్మ అంజనాదేవి, చిరంజీవి-సురేఖ దంపతులు, పవన్ కల్యాణ్, రాంచరన్-ఉపాసన దంపతులు, అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, అల్లు బాబీ దంపతులు, అల్లు శిరీష్, సుశ్మిత దంపతులు, శ్రీజ, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ మేనత్తలు నిశ్చితార్ధానికి వచ్చి వరుణ్, లావణ్యలను ఆశీర్వదించారు.
ఎన్‌గేజ్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసిన వరుణ్ తేజ్, "Found my Lav! @itsmelavanya (sic)." అని రాశాడు. అవే ఫోటోలను షేర్ చేసిన లావణ్య, "2016 Found my forever! @varunkonidela7" అని రాసింది.
తమ రెండో సినిమా 'అంతరిక్షం 9000 KMPH' చేసేటప్పుడు ఆ ఇద్ధరూ ప్రేమలో ఉన్నారనే విషయం యూనిట్ మెంబర్స్‌కు తెలిసింది. 2020లో వరుణ్ చెల్లెలు నిహారిక పెళ్లికి హాజరైన కొద్దిమంది సెలబ్రిటీలలో లావణ్య కూడా ఉంది. అది వరుణ్, లావణ్య మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే రూమర్స్‌కు బలం చేకూర్చింది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం గత డిసెంబర్ 15న లావణ్య పుట్టినరోజుకు వరుణ్ పెళ్లి ప్రపోజల్ తెచ్చాడు. ఆ తర్వాత ఆ ఇద్దరూ తమ తల్లితండ్రులకు ఈ విషయం చెప్పి వారి అంగీకారం తీసుకున్నారు. అయితే నాగబాబు సైతం ఇంతదాకా ఎక్కడా ఈ విషయాన్ని బహిర్గతం చెయ్యలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
