ధియేటర్‌కొచ్చిన భారత మాజీ ప్రధాని
on Oct 7, 2016

ఎప్పుడు రాజకీయాలు, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య గడిపే భారత మాజీ ప్రధాని సినిమా ధియేటర్లో ప్రత్యక్షమైతే..బెంగళూరులో అదే జరిగింది. అసలు మ్యాటర్‌లోకి వెళితే..మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ నటించిన జాగ్వార్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనవడు తొలిసారిగా తేరంగేట్రం చేసిన సినిమా కావడంతో..అతను ఎలా నటించాడో స్వయంగా చూడాలని అనుకున్న దేవేగౌడ బెంగళూరులోని సంతోష్ ధియేటర్‌లో కొడుకు, మనవడితో కలిసి జాగ్వార్ సినిమాను వీక్షించారు. తన పక్కనే ఉన్న మనవడితో డ్యాన్స్, ఫైట్స్ బాగా చేశావంటూ ప్రశంసించారు. మొత్తానికి మనవడిని తెరమీద చూసుకోవాలనే కోరిక దేవగౌడను ఈ వయసులో ధియేటర్ దాకా రప్పించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



