Home

»

Latest News

ఫ‌రియా ఫెస్టివ‌ల్ హ్యాట్రిక్ !

Jan 18, 2022 10:56AM

`జాతిరత్నాలు`లో చిట్టిగా త‌న క్యూట్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది తెలుగమ్మాయి ఫ‌రియా అబ్దుల్లా. మొద‌టి సినిమాతోనే మెమ‌ర‌బుల్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ఆపై వెంట‌నే మ‌రే చిత్రంలోనూ నాయిక‌గా క‌నిపించ‌ని ఫరియా.. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో మాత్రం స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇచ్చింది. ఆ సినిమాలే.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`, `బంగార్రాజు`.

Also Read: మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్!

అక్కినేని అఖిల్ టైటిల్ రోల్ లో సంద‌డి చేసిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`లో స్పెష‌ల్ రోల్ లో ఇంప్రెస్ చేసిన ఫ‌రియా.. ఆపై అక్కినేని నాగార్జున‌, అక్కినేని నాగ‌చైత‌న్య టైటిల్ రోల్స్ లో న‌టించిన `బంగార్రాజు`లో స్పెష‌ల్ సాంగ్ లో చిందేసింది. మొత్తంగా.. అక్కినేని హీరోల‌కి అచ్చొచ్చిన అతిథిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ

ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `జాతిరత్నాలు`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`, `బంగార్రాజు`.. ఇలా ఫ‌రియా క‌నువిందు చేసిన సినిమాల‌న్నీ కూడా ఫెస్టివ‌ల్ స్పెష‌ల్ గానే రిలీజ్ కావ‌డం విశేషం. 2021 మ‌హాశివ‌రాత్రి కానుక‌గా `జాతిర‌త్నాలు` జ‌నం ముందుకు రాగా.. 2021 విజ‌య‌ద‌శ‌మి స్పెష‌ల్ గా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` సంద‌డి చేసింది. ఇక 2022 సంక్రాంతి కానుక‌గా `బంగార్రాజు` వినోదాలు పంచింది. ఓవ‌రాల్ గా.. ఫ‌రియాకి ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లో  (నాయిక‌గా, స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ తో) హ్యాట్రిక్ ద‌క్కిన‌ట్ల‌య్యింది. మ‌రి.. భ‌విష్య‌త్ లోనూ ఫ‌రియా అబ్దుల్లా ఫెస్టివ‌ల్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com