రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామాలీకి మద్దతు ఇస్తున్న అభిమానులు ఎవరు?
on Dec 4, 2025
ఏమాయ చేసావె చిత్రంలో కలిసి నటించిన నాగచైతన్య, సమంత.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్ళపాటు డేటింగ్ చేసిన ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలపాటు వీరి మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది అనిపించినా 2021 జూలైలో సడన్‌గా తన పేరు ముందు అక్కినేని అనే సర్‌నేమ్‌ని తొలగించింది సమంత. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత మూడు నెలలకు తాము విడిపోతున్నట్టు ప్రకటించారు నాగచైతన్య, సమంత.
అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న సమంత.. దర్శకనిర్మాత రాజ్ నిడుమోరుతో ప్రేమలో పడి కొంతకాలంగా అతనితో డేటింగ్‌లో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని వీరిద్దరూ ఏ సందర్భంలోనూ కొట్టిపారెయ్యలేదు. దీంతో వీరి మధ్య ఉన్న బంధం నిజమేననే నిర్థారణకు వచ్చారందరూ. ఫైనల్‌గా 2025 డిసెంబర్ 1న కోయంబత్తూర్ ఇషా యోగ సెంటర్‌లోని లింగభైరవి టెంపుల్‌లో రాజ్, సమంత వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామాలి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. గతంలో రాజ్, సమంత డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వచ్చినపుడు కూడా శ్యామాలి పలుమార్లు పోస్టులు పెట్టారు. పెళ్లి తర్వాత ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
'ఎంతోకాలంగా నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నాపై దయచూపి అండగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. నాకు ఎలాంటి పి.ఆర్. టీమ్ లేదు. నేనే స్వయంగా పోస్టులు పెడుతుంటాను. నాపై అభిమానం చూపిస్తున్న వారందరికీ ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ పెట్టారు శ్యామాలి.
శ్యామాలీకి అభిమానుల నుంచి అంతటి ఆదరణ లభించడానికి సమంతపై వారికి ఉన్న వ్యతిరేకతే కారణం. ముఖ్యంగా అక్కినేని వంశాభిమానులు సమంత తీరును తప్పుబడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే నాగచైతన్యను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొన్నాళ్ళకే అతని నుంచి విడిపోవడం వారికి నచ్చలేదు. అంతేకాదు, కొన్ని సినిమాల్లో ఆమె చేసిన అసభ్యమైన నృత్యాల పట్ల కూడా వారికి వ్యతిరేకత ఉంది.
అయితే ఎప్పటికైనా నాగచైతన్య, సమంత కలుస్తారనే నమ్మకంతో అక్కినేని అభిమానులు ఉన్నట్టు సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టుల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు రాజ్ నిడుమోరుతో ప్రేమాయణం నెరపి అతన్ని రెండో పెళ్ళి చేసుకోవడంతో సమంతపై అభిమానులకు ఉన్న ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అందుకే రాజ్ నిడుమోరు మొదటి భార్య శ్యామాలీకి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఆ క్రమంలోనే తనపై అభిమానం చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో పోస్టు చేశారు శ్యామాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



