Home

»

Latest News

ENE Repeat: ఈఎన్ఈ రిపీట్ మూవీ రివ్యూ

Nov 19, 2026 7:57AM

నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, రామ్

సాంకేతిక నిపుణులు:

రచన: శాంతన్ రాజ్, తరుణ్ భాస్కర్

సంగీతం: వివేక్ సాగర్

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్

దర్శకత్వం: తరుణ్ భాస్కర్

నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి

 

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emayyindi) బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ కల్ట్ స్టేటస్ కారణంగానే, మేకర్స్ 8 ఏళ్ల తర్వాత కొంతమంది కొత్త నటీనటులను జోడించి, దాదాపు అదే సాంకేతిక బృందంతో ఈఎన్ఈ రిపీట్ (ENE Repeat) పేరుతో సీక్వెల్ తీశారు. ఈరోజే ( 19th November) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో వివరంగా చూద్దాం.

 

కథ:

వివేక్ (Vishwak Sen) దర్శకత్వంలో కౌశిక్ (Abhinav Gomatham) కమెడియన్‌గా, కార్తీక్ (Srinath Maganti) కెమెరామెన్‌గా, ఉపేంద్ర అలియాస్ ఉప్పు (Venkatesh) ఎడిటర్‌గా ఒక సినిమా చేస్తారు. ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకుంటారు, కానీ మొదటి రివ్యూలోనే అది ఫ్లాప్ అని తేలిపోతుంది. వివేక్ ఆ బాధ్యతను తనపై వేసుకుని, అప్పులన్నీ తానే తీర్చాలని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రమంలో తనను తాను ఒంటరిగా బంధించుకోవడంతో, అతని ప్రేయసి షిర్లీ (Anisha Ambrose) అతన్ని వదిలి వెళ్లి, ఫారిన్ సబ్సిడీ ప్రొడక్షన్‌లో స్పెషలైజేషన్ ఉన్న లైన్ కో-ఆర్డినేటర్‌గా సెటిల్ అవుతుంది. వివేక్ ఎనిమిదేళ్ల పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతాడు. మరోవైపు, ప్రతి సినిమాలో చెంపదెబ్బ తినడం ఒక సెంటిమెంట్‌గా మారడంతో కౌశిక్ ఆ పాత్రలతోనే సెటిల్ అవుతాడు. కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా స్థిరపడతాడు.

ఉప్పు కజిన్ సిస్టర్ కీర్తన (Shivatmika Rajasekhar) తండ్రి (Ram) చాలా కంట్రోలింగ్ మనస్తత్వం గల వ్యక్తి. ఆమెను డాక్టర్ చేయాలని ఆయన అనుకుంటారు, కానీ ఆమె సినిమాపై ఉన్న ఇష్టంతో పరోక్షంగా చదువు మానేసి కార్తీక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఈ గ్యాంగ్ వల్ల ఆమె పెళ్లి సంబంధం గందరగోళంగా మారుతుంది. దాంతో ఆమె తండ్రి, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తాను ఖర్చు చేసిన అదే బడ్జెట్‌లో ఒక సినిమా తీయాలని వీరికి సవాల్ విసురుతాడు. మరి వీరు ఆ సవాల్‌ను పూర్తి చేయగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

 

విశ్లేషణ:

సైకో వివేక్‌గా విశ్వక్ సేన్ నటనతో మెప్పించాడు. కానీ ప్యానిక్ అటాక్స్, గుండె దడ వంటి సన్నివేశాల్లో  అకస్మాత్తుగా కట్స్ పడుతూ ఉంటాయి అందువల్ల పెద్ద గా ఆకట్టుకోదు. అతని పాత్ర రాసుకున్న విధానం అస్తవ్యస్తంగా అనిపిస్తుంది; అతనికి ఇగో ఎక్కువని స్నేహితులు నమ్ముతారు గొడవలు పడతారు ... కానీ అది అంత ఒక్క మాట లో తేల్చేస్తారు. 

శ్రీనాథ్ మాగంటి బాగానే చేశాడు కానీ, కొన్నిసార్లు షాట్‌లో ఎనర్జీని తీసుకురావడానికి అవసరం కంటే ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. గ్యాంగ్‌తో పాటు కథకు కీలకంగా ఉండాల్సిన శివాత్మిక రాజశేఖర్ పాత్రను త్వరగా పక్కన పెట్టేశారు, ఆమె సమస్యలను ఒకే ఒక్క బిట్‌లో పరిష్కరించేశారు.

అభినవ్ గోమఠం తన వరుస వన్-లైనర్లతో, ఎలుగుబంటి ఎపిసోడ్‌తో థియేటర్లో నవ్వులు పూయించాడు. కానీ అతని పాత్ర మళ్లీ ఒకేలా సాగుతుంది. వెంకటేష్ బాగా చేశాడు. అనీషా పాత్ర వృథా అయింది. రామ్ మరియు ఇతర నటులు పెద్దగా ప్రభావం చూపలేదు, అయితే అందరిలోనూ తాళ్లూరి రాజేశ్వరికి మంచి సన్నివేశం దక్కింది.

 సినిమాలపై ఇన్-హౌస్ సెటైర్లు వేయడంలో తరుణ్ భాస్కర్ తన పట్టును చూపించాడు. కానీ ప్రధాన ఎమోషనల్ సన్నివేశాల్లో అతని రచన చాలా తేలిపోవడంతో అన్నీ రాండమ్‌గా అనిపిస్తాయి. సింగిల్ షాట్ సీన్ ఎగ్జిక్యూషన్‌లో ఎలాంటి ప్రయోజనం కనిపించదు. సరైన కో-ఆర్డినేషన్ లేకుండా డార్క్ మరియు కేయాటిక్ హ్యూమర్ కోసం చేసిన బలవంతపు ప్రయత్నంలా అనిపిస్తుంది.

ఎగ్జిక్యూషన్ పరంగా తరుణ్ ఫ్రెంచ్, జపనీస్ సినిమాల్లో తరచుగా వాడే కొన్ని కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ ప్యాటర్న్స్ ప్రయత్నించాడు కానీ, ఆ టెక్నిక్స్‌కు అవసరమైన సరైన ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు. సుజీత్, సందీప్ రెడ్డి వంగా, నందిని రెడ్డి, అనిల్ రావిపూడిలను క్యామియోల కోసం తీసుకురావడంలో అతని తెలివితేటలు కనిపిస్తాయి, కానీ వాటిలో ఎక్కువ భాగాన్ని క్రెడిట్స్ తర్వాత పెట్టాడు. పంచతంత్రం సినిమా లాంటి గందరగోళం నుంచి పుట్టే కామెడీ లోనే సొల్యూషన్ తేవాలి అని ప్రయత్నించాడు కానీ రచన లో ఆ పదును కుదరలేదు. 

ట్రాపిక్ థండర్, నైట్ ఎట్ ది మ్యూజియం తరహాలో, అసలు థీమ్స్‌ను ప్లేసిబోలుగా జోకుల్లో అంతర్లీనంగా ఉంచుతూ సెటైరికల్ అంశాలను కథనంలోకి ఎక్కువగా తీసుకురావడానికి సినిమా ప్రయత్నిస్తుంది. అయితే అవన్నీ సహజంగా కాకుండా రాండమ్‌గా అనిపించడమే ఇక్కడ సమస్య. ఈ నగరానికి ఏమైంది ఆ విషయంలో చాలా మెరుగ్గా చెప్పగలిగారు. టెక్నికల్‌గా కొన్ని భాగాలు బాగున్నా, చాలా ఛాయిస్‌లు వర్కౌట్ కాలేదు. వివేక్ సాగర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిరాశపరిచాయి.

నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ సినిమా మంచి నవ్వులను అందిస్తుంది కానీ, కథనంలో బలమైన లోతు లేదు. థీమాటిక్‌గా ఇందులో మంచి కోర్ పాయింట్ ఉంది, కానీ తమాషా సినిమా తరహా లోనే ఇది కూడా చెప్పాల్సిన విషయం మనసుకు హత్తుచుకునే లా చెప్పడం లో విఫలం అయ్యింది అనే చెప్పాలి. ఒక్కసారి చూడొచ్చు. 

 

ప్లస్ పాయింట్స్:

ప్రధాన నటీనటుల  నటన

అభినవ్ పంచులు 

సినిమా కోర్ పాయింట్

పెద్ద దర్శకుల క్యామియోస్ 

మైనస్ పాయింట్స్:

ప్లేసిబో ఎఫెక్ట్‌ను మరీ సింపుల్‌గా తేల్చెయ్యడం

కథనం లో పట్టు లేకపోవడం

గందరగోళం నుంచి పుట్టించాల్సిన  అనుకున్న కామెడీ ఇంకా గందరగోళం గా ఉండటం

క్లైమాక్స్ లో పట్టు లోపించడం 

పేలవమైన రచన

 

చివరి గా: తక్కువ అంచనాలతో వెళ్తే,  ENE రిపీట్ ని  ఒక్కసారి చూడొచ్చు.

 

రేటింగ్: 2.5/5

 

గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వీటికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు వీక్షకులు తమ విచక్షణను ఉపయోగించాలని సూచించడమైనది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com