
‘ఈ నగరానికి ఏమైంది’ అభిమానులకు మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత అదే గ్యాంగ్ తిరిగి రావడంతో థియేటర్లలో సందడి మొదలైంది. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.23.12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా మొదట్లో సాధారణ విజయాన్ని అందుకున్నా.. ఆ తర్వాత యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నలుగురు స్నేహితుల మధ్య సాగే సరదా, వారి కలలు, గోవా ప్రయాణం, సహజమైన కామెడీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, సన్నివేశాలు సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారి ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటాయి. 2023లో రీ-రిలీజ్ చేసినప్పుడు కూడా మంచి స్పందన రావడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది.
ఇప్పుడు ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు తరుణ్ భాస్కర్ ‘ENE రిపీట్’తో అదే స్నేహితుల గ్యాంగ్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను తమ పాత పాత్రల్లోనే కనిపిస్తుండగా.. కార్తీక్ పాత్రలో ఈసారి శ్రీనాథ్ మాగంటి నటించారు. అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

మొదటి భాగంలో గోవా నేపథ్యంలో సాగిన స్నేహితుల ప్రయాణం ప్రేక్షకులను నవ్విస్తే.. ఈసారి వారి కొత్త సాహసాలు, గందరగోళాలు కథలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. సినిమా ట్రైలర్ నుంచే పాత గ్యాంగ్ కామెడీ, స్నేహితుల మధ్య కెమిస్ట్రీపై అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన సహజమైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఇది కూడా చదవండి: ప్రశాంత్ వర్మకు బిగ్ షాక్.. మరో ‘హనుమాన్ 2’ ప్రకటించిన ప్రొడ్యూసర్స్!
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో పలువురు దర్శకులు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, సుజీత్, అనుదీప్ కేవీ వంటి దర్శకుల క్యామియోలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ఇలా పాత సినిమా జ్ఞాపకాలు, కొత్త కథనం, స్నేహితుల గ్యాంగ్ మళ్లీ కలవడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

మొత్తానికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న కల్ట్ క్రేజ్ సీక్వెల్‌కు మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ.23.12 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.?
ఘనంగా జబర్దస్త్ బాబు పెళ్లి.. వధువు ఎవరో తెలుసా.?
[ENE Repeat, Box Office, Ee Nagaraniki Emaindi 2, Vishwak Sen, Tharun Bhascker]






